పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ బాలకృష్ణ  ‘జైసింహా’ తో సంక్రాంతి వార్ లో పోటీపడడం వల్ల బిజినెస్‌ పరంగా పవన్ సినిమాకు ఎలాంటి భయం ఉండకపోయినా పవన్ సినిమాకు  థియేటర్ల కొరత ఎంతోకొంత వెంటాడుతుంది అనేగాసిప్పుల హడావిడి అప్పుడే ప్రారంభం అయింది. దీనికికారణం సీడెడ్‌ గుంటూరు కృష్ణ జిల్లాలకు సంబంధించిన ఏరియాల్లో బాలయ్య సినిమా ఉందంటే బిసి సెంటర్లలో థియేటర్లని ముందే బుక్‌  చేయడం ఒక సాంప్రదాయంగా ఎప్పటినుంచో కొనసాగుతోంది. 

దీనితో ఈప్రాంతాలలోని  సింగిల్‌ థియేటర్‌ లేదా డబుల్‌ థియేటర్‌ ఉన్న ఊళ్లల్లో ఉండే  థియేటర్లు అన్నీ బాలయ్య సినిమా వైపు మొగ్గుచూపడం అనేకసందర్భాలలో గతంలో కనిపించింది. దీనితో బాలయ్య సినిమాకు పోటీగా వచ్చిన ఇతర టాప్ హీరోల సినిమాలకు ఈప్రాంతాలకు సంబంధించిన ఊళ్ళల్లో థియేటర్లు దొరకడం కష్టం అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ప్రస్తుతం ఎంతటి టాప్ హీరో సినిమాకు అయినా మొదటివారంలో వసూళ్లు సాధించడమే ఇప్పుడు సినిమా విజయానికి కీలకంగా మారడంతో ఇలాంటి సింగిల్‌ థియేటర్‌ ఉన్న ఊళ్లల్లో పవన్ సినిమాకు బాలకృష్ణ సినిమాతో తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. 

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న 'అజ్ఞాతవాసి' చిత్రం జనవరి 10న రిలీజ్‌ అవుతోంటే 12న  బాలకృష్ణ ‘జైసింహా’ వస్తోంది. దీనివల్ల కేవలం రెండురోజులు మాత్రమే పవన్‌ సినిమాకి అన్ని థియేటర్లు దొరుకుతాయి. సింగిల్‌ థియేటర్‌ ఉన్న సి క్లాసు సెంటర్లో కేవలం రెండురోజులు మాత్రమే పవన్ సినిమాను ప్రదర్శిస్తారు. ఆతరువాత వచ్చే బాలకృష్ణ సినిమా కాకుండా పవన్ సినిమాను కొనసాగించడానికి ఇలాంటి సి క్లాసు సెంటర్స్ లోని ధియేటర్ యజమానులు జంకుతారు అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇది ఇలాఉండగా అప్పుడే ‘జైసింహా’ చిత్రానికి భారీస్థాయిలో థియేటర్లు బుక్‌ అయిపోతున్నాయి అన్నవార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘జైసింహా’ వల్ల సి క్లాసు సెంటర్‌లో పవన్‌ సినిమాకి థియేటర్స్ మిస్‌ అయ్యే అవకాసం ఉంది అని అంటున్నారు. దీనితో బాలయ్యతో పోటీకి దిగుతున్న పవన్ కు ఊహించని పెయిన్స్‌ ఫేస్ చేయడం ఖాయం అనే మాటల హడావిడి అప్పుడే  ప్ర్రారంభం అయిపోయింది. దీనితో ‘అజ్ఞాతవాసి’ ని భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు ఈ వార్తలు విని షాక్ అవుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: