తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు.  నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటింది. ఈ మద్య తన సహనటి సమంతను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే.  ఇక వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. 
Image result for హల్లో
అఖిల్‌ ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తన రెండో చిత్రం హల్లో షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. స్వయంగా నాగ్‌ దగ్గరుండి మరీ అఖిల్‌ విషయంలో మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అఖిల్ హల్లో చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..తాజాగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. 
Image result for akhil hello new posters
ఈ చిత్రం చూస్తుంటే..సెంటిమెంట్, లవ్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తుంది.  అఖిల్ కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు..యాక్షన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి.

నాగ్ వాయిస్‌ ఓవర్‌తో ‘ ద లక్కియెస్ట్ పీపుల్ బార్న్ ఆన్ ది దిస్ ఎర్త్..వాళ్లు మాత్రం ఎవరేం చేసినా..ఏం అడ్డు వచ్చినా..తన సోల్ మేట్ ని కలుస్తారు..లైఫ్ ని షేర్ చేసుకుంటారని’ మొదలైని టీజర్ లో అఖిల్ చిన్ననాటి పాత్రలు కనిపిస్తున్నాయి. అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనూప్‌ స్వరాలను అందిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: