ఇప్పటి వరకు చిరంజీవి డాన్స్ లను చిరంజీవి పాటలను బాగా వాడుకుని మెగా అభిమానులకు బాగా కనెక్ట్ అయిన సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ లో ఒక రాజకీయ అంశాన్ని టచ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కమ్యూనిస్టులు నక్సలైట్లు ప్రస్తావన ఉన్న సినిమాలు వచ్చాయి కానీ ఆరెస్సెస్ ప్రస్తావన ఉన్న సినిమాలు మన దక్షిణ భారతదేశంలోని ఏభాషలోను రాలేదు. 'నమస్తే సదా వత్సలే మాతృభూమి' అనే ఆరెస్సెస్ గీతం ఏసినిమాలోనూ వినిపించిన నేపధ్యం లేదు.

అయితే ఇప్పుడు భారతీయ జనతాపార్టీ హవాతో పాటు ఆరెస్సెస్ హవా కూడ దేశవ్యాప్తంగా ప్రతిచోట కనిపిస్తున్న నేపధ్యంలో సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ లో ఆరెస్సెస్ గీతం వినిపించబోతోంది అనే న్యూస్ సంచలనంగా మారింది. బివిఎస్ రవి డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈసినిమాను ఒకప్పటి ఎన్టీఆర్ మేనేజర్ కృష్ణ నిర్మాతగా మారి తీస్తున్నాడు. 

అయితే ఈసినిమాను ప్రమోట్ చేస్తుంది మాత్రం దిల్ రాజ్ కావడంతో ప్రస్తుతం దిల్ రాజ్ కు నడుస్తున్న అదృష్టం ఈ ‘జవాన్’ కు కూడ పడుతుంది అన్న అంచనాలలో సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. ఈ సినిమాలో టైటిల్ కు అనుగుణంగా ‘జవాన్ అంటే సమాజ శ్రేయస్సు పట్ల అంకిత భావం ఉన్నవాడు’ అనే అర్థంలో ఈసినిమా కథను అల్లినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమాలో హీరోకి ఆరెస్సెస్ మూలాలు ఉంటాయట. 'కుటుంబంతో ఎలా ఉండాలో నాన్న నేర్పాడు, సమాజంతో ఎలా ఉండాలో ఆరెస్సెస్ నేర్పింది' అనే డైలాగు కూడా ఈసినిమాలో ఉంటుందట. ఒక సామాజిక స్పృహతో తీసిన ఈకథ వెరైటీగా ఉంటుంది అని అంటున్నారు. తేజు మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్ లు తమ రాజకీయ ఉద్దేశాలతో ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులుగా ఎదిగిన నేపధ్యంలో ఈవిషయంలో కూడ తేజు తన మేనమామలను అనుసరిస్తూ సామాజిక స్పృహతో కూడిన సినిమాలను చేస్తున్నాడు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: