ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో హీరోల మద్య పోటీ విపరీతంగా ఉంటుంది.  పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు సైతం ఒకేరోజు..లేదా మరసుటి రోజు రిలీజ్ చేస్తూ పోటీలు ఉంటున్నారు.  ఇక చిన్న సినిమాల జోరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..సందిట్లో సడేమియలా తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీగా ఉంటున్నాయి.  వెరసి ఈ రోజు ఏకంగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటిపడుతున్నాయి.
Related image
తమిళ్ హీరో కార్తీ, రకుల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ డబ్బింగ్ సినిమా ఖాకీ చిత్రం నేడే విడుదల కానుండగా, దీనిపై జనాల దృష్టి ఎక్కువగా ఉంది. ఇక సిద్ధార్ద్ నటించిన గృహం సినిమా ఇప్పటికే హిందీ,తమిళంలో విడుదల కాగా అక్కడ హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదాలు పడుతూ వచ్చింది.
Image result for siddharth gruham
ఈ సినిమా పై సిద్దార్థ్ బాగా నమ్మకంగా ఉన్నారు. ఇక మారుతి కంపెనీ నుండి వస్తున్న లండన్ బాబులు చిత్రం ఆసక్తికర జాబితాలో ఉంది. కలర్స్ స్వాతి ముఖ్య పాత్రలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ అభిమానులలో అంచనాలు పెంచింది. కొత్త సినిమాలు కోత్త నటులు కూడా సందడి చేస్తున్నారు. 
Image result for snehamera jeevitham

ఈ నేపథ్యంలో  ప్రేమతో మీ కార్తీక్, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, స్నేహమేరా జీవితం, లవర్స్ క్లబ్ తదితర చిత్రాలు కూడా నేడే విడుదల అవుతున్నాయి.
Image result for prematho karthik
ఈ చిత్రాలపై కూడా పబ్లిక్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఒకే రోజు తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటి పడుతుంటే, ఇందులో ఏ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందుతుందనేది సాయంత్రం వకు తెలిసిపోతుంది 


మరింత సమాచారం తెలుసుకోండి: