నంది అవార్డ్స్ ప్రకటన వచ్చి మూడురోజులు గడిచిపోయినా ఆ అవార్డ్స్ తెచ్చిన చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవిధంగా ఈఅవార్డ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీని రెండు వర్గాలుగా చీల్చి వేసింది అన్నకామెంట్స్ చాలస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఎటువంటి విషయాన్ని అయినా మనసులో పెట్టుకోకుండా చాల స్పష్టంగా మాట్లాడే విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి ఈ అవార్డ్ ల గోలలో ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

తన దృష్టిలో ‘బాహుబలి’ ఒక పూర్తి కమర్షియల్ సినిమా మాత్రమే అని ఆవిషయాన్ని పట్టించుకోకుండా ‘నంది’ అవార్డ్స్ ఎంపికలో ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ అవార్డులు ఇచ్చారో తనకు అర్ధం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘బాహుబలి’ కి బదులు ‘రుద్రమదేవి’ కి ఈస్థాయిలో అవార్డ్ లు ఇస్తే బాగుండేది అన్నది తన అభిప్రాయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు నారాయణమూర్తి.
 
ఇది ఇలాఉండగా ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం పై ఉద్యమాలు చేస్తున్న హీరో శివాజీ నిన్న రాత్రి ఒకప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈనంది అవార్డుల రగడ పై తనదైన రీతిలో స్పందించాడు. సినిమా ఇండస్ట్రీలో భజనపరులు ఉన్నారని అలాంటి వారు ఎవరు పవర్ లో ఉంటే వారికి భజన చేస్తుంటారని అంటూ నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీ హీరోలకు అన్యాయం జరిగిందన్న మాటలలో వాస్తవాలు ఉన్నాయి అంటున్నాడు శివాజీ.

కొందరు వ్యక్తుల అభిప్రాయంతో కాకుండా ప్రజల అభిప్రాయంతో నంది అవార్డులు ఇస్తే గొడవ ఉండదు అన్న అభిప్రాయాన్ని శివాజీ వ్యక్త పరిచాడు. గతంలో తాను హీరోగా నటించిన ‘మిస్సమ్మ’  సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడు అవార్డ్ ఇవ్వాలని చాలామంది నంది అవార్డ్ కమిటీ సభ్యులు భావించినా అప్పట్లో కొందరు తన అవార్డ్ ను అడ్డుకున్న విషయాన్ని బయట పెట్టాడు శివాజీ. ఇలా ప్రముఖ స్థానంలో ఉన్న టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా నంది అవార్డ్ లను టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో ఈ అవార్డ్ ల ప్రక్రియ మూడు నందులు ఆరు వర్గాలుగా విడిపోయింది అంటూ సెటైర్లు పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: