కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం లండన్ లో ఉన్న విషయం తెలిసిందే. ‘జనసేన’ స్థాపించిన తరువాత ప్రజాసమస్యల పై తనదైన రీతిలో స్పందిస్తూ రాబోతున్న ఎన్నికల సమరానికి తన ‘జనసేన’ ను సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు పవన్.

ఇలాంటి పరిస్థుతులలో పవన్ లేటెస్ట్ గా చేపట్టిన లండన్ పర్యటనకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అక్కడ అనేకమంది అభిమానులతోపాటు మేధావులను కలుస్తున్న పవన్ అనేక సమస్యల పై లోతుగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ‘జనసేన’ కార్యకర్తలతో కూడా సమావేశమవుతున్నాడు పవన్. 

ఈ పర్యటనలో ఈ పర్యటనలో ప్రఖ్యాత ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందించే ఎక్సలెన్సీ అవార్డును ఈరోజు పవన్ కళ్యాణ్ అందుకోబోతున్నాడు. ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొని గ్లోబల్ ఇన్వెస్టుమెంట్ న్యూ ఇండియా సదస్సులో భాగంగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అవకాశాల గురించి పవన్ విస్తృతంగా మాట్లాడుతాడని తెలుస్తోంది. ఇదే సందర్భంలో యూరప్ లోని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతోనూ పవన్ సమావేశం కాబోతున్నాడు. 

నిన్న లండన్ లోని అంబేద్కర్ మొమోరియల్ ను సందర్శించి అక్కడ విశేషాలను తెలుసుకోవడమే కాకుండా అక్కడి విజిటర్స్ బుక్ లో పవన్ సంతకం చేయడమే కాకుండా ఆ అంబేద్కర్ మెమోరియల్ హాల్ పై తన అభిప్రాయాన్ని కూడ ఆవిజిటర్స్ బుక్ లో వెల్లడించాడు. అయితే ఈ లండన్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తరువాత పవన్ తన ‘జనసేన’ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాడని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ కాకుండా మరొక సినిమా ఇప్పట్లో చేసే అవకాశాలు లేవు అన్న మాటలు చాల గట్టిగా వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: