ఒక సినిమా గురించి ఒక రేంజ్ లో చర్చజరగటం అదొక టెలివిజన్ సీరియల్ కార్యక్రంలాగా చూస్తుండటం బాహుబలి తర్వాత మళ్ళీ అంతగా చర్చ జరుగటం వార్తలు ఫాలో అవటం అభిమానుల ఆశలు ఆకాశంలోకి ఎగరటం మెగాస్టార్ చిరంజీవి కథా నాయకుడుగా నటిస్తున్న 151వ చిత్రం "సైరా" అనే చెప్పవచ్చు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కనున్న ఈచిత్రం డిసెంబర్ మొదటివారంలొ రెగులర్ షూటింగ్ జరుపుకుంటుందని భావిస్తుండగా,ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త సోషల్-మీడియా లో చక్కర్లు కొడుతుంది. 
saira narasimha reddy production news కోసం చిత్ర ఫలితం

దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులన్ని పూర్తి చేసుకున్న సైరా అంచనాలను మించేలా తెరకెక్కనుంది. ప్రముఖ దిగ్గజనటులు, టాప్టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగంపంచు కొని సైరా సినిమాపై ఒక రేంజ్ లో ఎక్స్-పెక్టేషన్స్ ఉండేలా పెంచుకు పోతు న్నాయి.  

saira narasimha reddy production news కోసం చిత్ర ఫలితం


సైరా చిత్రం ప్రముఖ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కనుండగా, ఈ మూవీని అతడు ఎలా హ్యండిల్ చేస్తాడా! అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇందు కోసం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను "టెస్ట్-షూట్" చేయించారట "సైరా నరసింహరెడ్డి" పాత్ర లో తాను ఎలా ఉంటానోనని తెలుసుకోవడానికి చిరంజీవి కూడా  "ఫుల్ కాస్ట్యూమ్" ధరించి టెస్ట్-షూట్ లో పాల్గొన్నారట. తన సినీ జీవితంలో "టెస్ట్-షూట్" లో పాల్గొనడం చిరంజీవికి ఇదే మొదటిసారట.

ఈ సినిమా కోసం భారీ తారాగణంతో పాటు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు హిందీలో భారీ క్రేజ్ తెచ్చేందుకు "బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్‌" ను ఇందులో నటించేందుకు ఒప్పించారు. ఈ చారిత్రక చిత్రం నుంచి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తప్పుకున్నారు. ఇతర కమిట్‌మెంట్స్‌తో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడమే కారణం. ఆయన స్థానంలో రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు.

Image result for chiranjeevi saira other stars
కొణిదెల ప్రొడక్షన్స్ బానరుపై రామ్ చరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి సైరా లో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. 
చిరంజీవి 'సైరా..' నరసింహారెడ్డిలో మరో స్టార్ హీరో చేరబోతున్నాడట. ఇక పక్కాగా ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉందట.

Image result for vijay sethupathi in chiranjeevi sairaa

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రిస్టేజియస్‌గా తీసుకున్న 'సైరా..నరసింహారెడ్డి' ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్నా ఇంకా సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే ఈ చిత్రంలోని నటీనటుల లిస్ట్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలు భాషల నుంచి ఉద్దండులైన నటులను ఎంపిక చేసుకున్న 'సైరా..' యూనిట్ తాజాగా ఈ చిత్రంలోని 10 నిమిషాల నిడివి గల కీలక పాత్రకు పవర్‎స్టార్ పవన్‌కళ్యాణ్‌ను సంప్రదించిందట. అన్నయ్య ప్రతిష్ఠాత్మక చారిత్రక చిత్రంలో కనిపించేందుకు.. కూడా సై అన్నాడట పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.

Image result for chiranjeevi saira other stars

 
ఇక ఇటీవలే 'సైరా నరసింహారెడ్డి' కోసం చిరంజీవిపై టెస్ట్ షూట్ నిర్వహించింది టీమ్. తాజాగా ఈ చిత్రంలో నటించనున్న విజయ్ సేతుపతి, నాజర్ పాత్రలకు కూడా మేకప్ వేసి టెస్ట్ షూట్స్ నిర్వహించాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ షూట్ కోసమే చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చాడట కోలీవుడ్ రైజింగ్ హీరో విజయ్ సేతుపతి. ఇక ఈ టెస్ట్ షూట్ రిజల్ట్ పట్ల 'సైరా..' టీమ్ ఎంతో సంతృప్తిగా ఉన్నారట. మొత్తంమీద ఇప్పటికే పక్కాగా ప్రి-ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ హిస్టారికల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: