తెలంగాణ విభజన పై బోల్డ్ బ్యూటీ గా పేరుగాంచిన షెర్లిన్ చోప్రా ఒక విచిత్రమైన స్పందన ఇచ్చింది. ఈ మధ్యనే ప్లేబాయ్ మేగజైన్ కోసం అందాలన్నీ నగ్నంగా ఆరబోసిన షెర్లిన్ చోప్రా పుట్టింది పెరిగింది మన భాగ్యనగరంలోనే అనే విషయం చాలా మందికి తెలియదు.  షెర్లిన్ చెప్రా రాష్ట్ర విభజనపై ఓ పత్రికతో  తన భావాలూ పంచు కుంటూ మన దేశం ఇప్పటికే ముక్కలు ముక్కలుగా  విభజించబడి ఉన్నా ఇంకా ఈ  తెలంగాణ ఆవిర్భావం ఎందుకో అర్థం చేసుకోవడంలో తాను విఫలం అయ్యానని వ్యాఖ్యానించింది.

ఈ విభజన ప్రజలు కోరుకున్నదే  అంటూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడటానికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది అని షెర్లిన్ చోప్రా అభిప్రాయ పడుతోంది.  క్రిస్టియన్ తండ్రికి, ముస్లిం తల్లికి  జన్మించిన షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా, ఈమె  హైదరాబాద్ లో ఉన్నప్పుడు తను చదువుకునే  రోజుల్లో మిస్ ఆంధ్రా  అవార్డు అందుకుంది. తరువాత బాలీవుడ్ కు వెళ్ళి కొన్ని సినిమాలలో నటించి యువతరాన్ని ఆకర్షించడానికి చాలా డేరింగ్ గా ఎక్సపోజింగ్ చేసి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ దిఇండస్ట్రీగా మారింది. ఈ మధ్యనే  ప్లే బాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇచ్చిన తొలి భారతీయ మోడల్‌గా చరిత్రకెక్కింది. ప్రస్తుతం షెర్లిన్ చోప్రా ‘కామసూత్ర 3డి' అనే శృంగార చిత్రంలో నటిస్తోంది.

శృంగార నాయికగా పేరున్న షెర్లిన్ చోప్రా ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదేపెస్తున్న విభజన సమస్య పై వ్యక్తిగత అభిప్రాయాన్ని చాలా డేరింగ్ గా వెల్లడించి మరోసారి వార్తలలో కేంద్ర బిందువు అయింది. ఈ ‘కామసూత్ర’ కధా నాయిక....
 

మరింత సమాచారం తెలుసుకోండి: