ఒక సినిమా అదీ చారిత్రాత్మక చిత్రరాజం. అద్భుతమైన తెలుగు జన చరిత్ర. మహిళాసాధికారత కు వన్నె తెచ్చి, విశ్వంలోనే మహిళల వికాసానికి పాలనపర సామర్ధ్యానికి పట్టాభిషేకం చేసిన చరిత్ర రాజాన్ని వెండితెరపై వెలుగులీనేలా చేసిన గుణశేఖర్ ధన్యుడు. ఇది చరిత్ర తెలుగుప్రజల గతానుక్రమణిక. ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే తెలుగువారికి కనిపించే వారి ఘనతర వైషిష్ట్యం. 
rudramadevi history  images కోసం చిత్ర ఫలితం

పరి పరి విధాల మహిళా సాధికారత గురించి ఘోషించిన తెలుగుదేశం ప్రభుత్వానికి మన చారిత్రలోని "మహిళాసాధికారత" పట్టంకట్టిన సినిమాకు అవార్డు ఇవ్వక పోవడం విచారకరమన్నారు ఆ చిత్ర దర్శకులు గునశేఖర్. అంతేకాదు, "రుద్రమదేవి" సినిమాకి "పన్ను మినహాయింపు" కోసం ప్రభుత్వ అధినేతను ఎంత వేడుకున్నా న్యాయం జరగలేదని బాధపడ్డారు. అయితే, "కంచె" సినిమాకు అవార్డు రావడాన్ని స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు.
సంబంధిత చిత్రం

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ నంది అవార్డులపై మళ్లీ హాట్ కామెంట్స్ చేశారు. "జ్యూరీ సభ్యుల వ్యాఖ్యలు అనుమానా స్పదం" అంటూ సరికొత్తగా బాంబు పేల్చారు. నంది అవార్డుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రుద్రమదేవి సినిమాకు జాతీయస్థాయిలో అవార్డు రాకపోయినా తాను బాధపడలేదని, అయితే, తెలుగు రాష్ట్రప్రభుత్వం నంది అవార్డు ఇవ్వకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. 
సంబంధిత చిత్రం

రుద్రమదేవి తెలుగు రాజవంశం కాకతీయుల రాజవంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ రాజవంశమునకు, ఆ పాలనకు అమోఘమైన పేరు ప్రఖ్యాతులని సాధించిపెట్టిన ధీర వీర వనిత. భారత దేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహా రాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందు వలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని "రుద్రదేవుడు" అని నామకరణం చేసాడు. కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమ దేవి "రుద్రమహారాజు" అనే పేరు తో పురుష రూపం లో కాకతీయ మహా సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది.

సంబంధిత చిత్రం

రుద్రదేవుడు మహిళ అని తెలిసిన తరవాత పురుషుడుగా ఉండగా ఆమె పాలనను మన్నించిన వారే అతను ఒక మహిళ అని తేలటం - ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. అదేసమయంలో నెల్లూరు పాండ్యుల కింద, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకి వెళ్లి పోయాయి పాకనాటి కాయస్థ అంబ దేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమ తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్ల ను అన్నిటినీ విజయవంతంగా అణచి వేసింది.

rudramadevi history  images కోసం చిత్ర ఫలితం

రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలోకీ దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు, అయితే రుద్రమ యాదవులను ఓడించి, దేవగిరి దుర్గం వరకూ తరిమి కొట్టింది. వేరే దారి లేని మహదేవుడు సంధికి దిగివచ్చి, యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు. రుద్రమదేవి యొక్క శైవమత గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, రెండవ ప్రతాపరుద్రునికి కూడా ఈయనే గురువు. రుద్రమ తానే స్వయంగా కాయస్థ రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఛందుపత్ల (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్థ అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

rudramadevi history  images కోసం చిత్ర ఫలితం

ఆతరవాత తన కుమర్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నేడు నిడదవోలు ) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు గణపతిదేవుడు  రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువ రాజుగా పట్టాభిషేకం చేసింది.

rudramadevi history  images కోసం చిత్ర ఫలితం


ప్రఖ్యాత  ఇటాలియన్ యాత్రికుడైన మార్కో-పోలో దేశము నుండి తిరిగివెళ్ళుతూ దక్షిణ భారతదేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి అనేక విధాల పొగిడాడు. మోటుపల్లి రేవు నుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి దేశ పరిపాలనలో ఆమెది చైతన్యవంతమైన పాత్ర అని, ధైర్య సాహసములు ధీరత్వం ఉన్న యోధురాలు అవడమే కాక గొప్ప వ్యూహతంత్రజ్ఞురాలని, ఆమె రాజరికం చేసిన కాలంలో తరుచూ యుద్ధముల అలజడి కలిగినా ఆమె ప్రజలు సంతుష్టులు, సంప్రీతులై సుఖించారు అని కూడా వివరముగా వ్రాశాడు.
rudramadevi history  images కోసం చిత్ర ఫలితం

ఇంతటి ఘనతర చరిత్ర గలిగిన తెలుగు వీరవనిత చరిత్ర అంతకంటే అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఏమాత్రం దర్శకుని ప్రతిభను - తెలుగు ప్రజల చరిత్రపై గౌరవం లేని విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించటం ఆ ప్రభుత్వం తీరు ప్రశ్నార్ధ కమవటం న్యాయమే అంటున్నారు. తప్పుసరిద్ధుకోవటం ప్రభుత్వానికవసరం. కారణం ఒకమహిళ మహిళాసాధికారత నేపధ్యం ఉన్న సినిమా కాబట్తి. దీనికి వినోదపు పన్ను ప్రభుత్వం రద్ధుచేయలేదు అదీ దర్శకుడు నివేదించిన తరవాత కూడా అనేక మంది విమర్శకులు విమర్సించిన తరవాతకూడా. చివరకు బంగారు నంది అవార్డ్ కూడా ప్రకటించక పోవటం "రాజ్య దురహంకారం" అనే అంటారు. 
rudramadevi history  images కోసం చిత్ర ఫలితం

లెజెండ్ అనే  ఏ సందేశమూ ఇవ్వని భయానక భీకర రక్తపాతం చిందించిన సినిమాకు తొమ్మిది నందులు ఇచ్చిన ప్రభుత్వం "ఆ సినిమాలో కొన్ని నిముషాలు మాత్రమే భౄణ హత్యలు"  నేపధ్యంలో అవార్ద్ యిచ్చినట్లు "ప్రసన్న" అనే కమిటీ సభ్యుడు టివి-9 సాక్షిగా సమాధానమిచ్చారు. అయినా ఇంతటి మహిళా సాధికారత ప్రాధాన్యము ఉన్న చిత్రానికి ఎలాంటి గౌరవం ఇవ్వక నిర్లక్ష్యం వహించటం "బంగారు నంది అవార్డుల ఎంపిక" కమిటీ  చేసిన ధారుణం. 
సంబంధిత చిత్రం

ఇందుకు ఒక టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో అవార్డుల కమిటీ ఛైర్‌పర్సన్‌ జీవిత ఇచ్చిన జవాబునే ఆధారంగా తీసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రభుత్వం వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వడానికి తిరస్కరించినప్పుడే గుణశేఖర్‌ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అవార్డుల్లో అన్యాయం జరగడంతో కుమిలిపోతున్నారు.

మూడు అవార్డుల్లో (బంగారు, రజతం, కాంస్యం) దేనికీ అర్హత లేదా అని ప్రశ్నించారు. రుద్రమదేవికి వినోదపు పన్ను మినహా యింపు ఎందుకు ఇవ్వలేదనేది తనకు స్పష్టంగా తెలియదని అంటూనే అది తెలంగాణ చిత్రమనే ఉద్దేశంతో ఇవ్వకపో యుండొచ్చన్నారు. ఇదే భావన అవార్డుల విషయంలో జరిగిందనే భావన ఆమె మాటల్లో ధ్వనించింది. కేసీఆర్‌ కూడా ఆమె తెలంగాణకు చెందిన వీరవనిత అని చాలాసార్లు చెప్పారు.


  సంబంధిత చిత్రం

తాను తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి అవార్డు రాకపోవడంతో ఎంతో ఆవేదన చెందానని ఆయన చెప్పారు. గుణశేఖర్ మాట్లాడుతూ “రుద్రమదేవి చిత్రానికి సంబంధించి గత రెండు రోజులుగా నాపై కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘రుద్రమదేవి’ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు దక్కలేదని, అన్యాయం జరిగిందని గుణశేఖర్ మాట్లాడుతున్నాడని అంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత దరఖాస్తు చేయడం వల్లే మా చిత్రానికి పన్ను మినహాయింపు దక్కలేదని అంటున్నారు. 2015 అక్టోబర్ 9న సినిమా విడుదల తేదీ అయితే 7వ తేదీ నాడే సెన్సార్ ధృవీకరణ పత్రం వచ్చింది.


అక్టోబర్ 8న అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ ప్రభుత్వాలకు  వినోదపు పన్ను మినహాయింపు గురించి దరఖాస్తు చేసుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పన్ను మినహాయింపునిచ్చింది. ఏపి ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఇక ‘రుద్రమదేవి’ చిత్రానికి అవార్డు రాకపోయినా నాకు బాధ లేదు. మహిళా సాధికారికతపై తీసిన ఈ చిత్రానికి ఈ  పురస్కారం దక్కకపోవడం బాధాకరం”అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: