కులాన్ని పాలిటిక్స్ కు అనుసంధానం చేస్తూ కామెంట్స్ చేయడం ఆనాయకుడు ఫలానా సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధి అంటూ ముద్రవేయడం రాజకీయాలలో సర్వసాధారణమైన విషయం. అయితే ఈ తరహా రాజకీయాలకు తాను వ్యతిరేకం అంటూ మాటలు చెపుతున్న పవన్ ఈ విషయంలో ఎంతవరకు సక్సస్ అవుతాడు అనే విషయం పక్కకు పెడితే పవన్ లేటెస్ట్ లండన్ టూర్ లో కుల ప్రస్తావనకు సంబంధించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

లండన్ పర్యటనలో ఉన్న పవన్ తనను కలిసిన వివిధ యూనివర్సిటీ విద్యార్ధులతో మాట్లాడుతూ తాను కుల రాజకీయాలకు వ్యతిరేకం అనీ కుల ప్రాతిపదికన ఎవరు మద్దతిచ్చినా తీసుకునేది లేదని స్పష్టం చేశాసాడు. అంతేకాదు మానవత్వమే తన కులం అంటూ కామెంట్స్ చేసాడు. 

'నేను ఏ కులంలో పుట్టినా, నాకు మాత్రం క్రిస్టియన్ పాప పుట్టింది. కులం అనేది మన ఛాయిస్ కానప్పుడు, ఆ కులానికి మనమెందుకు ప్రయారిటీ ఇవ్వాలి' అంటూ సూటిగా ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. ఈకామెంట్స్ లండన్ లోని ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్' నిర్వహించిన ‘యువ సమ్మేళనం’ లో చేసాడు.  అక్కడున్న యువతీయువకులతో ఇంటరాక్ట్ అయిన పవన్ ను ‘మీ దృష్టిలో మానవత్వం అంటే ఏంటి’ అన్న ఒకమ్మాయి ప్రశ్నకు పవన్ కళ్యాణ్  స్పందిస్తూ  కుల, వర్ణ, ప్రాంతాలంటూ ఏ అడ్డుగోడలూ లేకుండా సమభావం పాటించడమే మానవత్వం అంటూ సందేశాలు ఇచ్చాడు. 

అయితే సందేశాల వరకు పవన్ ఉపన్యాసాలు బాగానే ఉన్నా కుల వ్యవస్థ చుట్టూ తిరిగే రాజకీయాలను సంస్కరించే స్థాయిలో పవన్ చేస్తున్న ప్రయత్నాల ఫలితాలు ఇస్తాయా అన్నదే సందేహం. అయితే ‘జనసేన’ ద్వారా ఇటువంటి ఉద్దేశాలను ప్రజల మధ్యకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న పవన్ మాటలు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న రూరల్ ప్రజలకు కనెక్ట్ అవుతాయా అన్నదే ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి: