ఔను.. పద్మావతి.. ఇప్పుడు దేశమంతటా మారుమోగుతున్న సినిమా పేరు.. దీపికాపదుకునే నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అన్న సంగతి తెలిసిందే. అలాంటి పద్మావతి హీరోయిన్ దీపికాపదుకునే అమరావతిని తెగ మెచ్చేసుకుంది. అమరావతి పచ్చదనం తనను ఎంతో ఆకర్షించిందని ఏపీ రాజధానిని తెగ పొగిడేసింది. సోషల్ మీడియా తొలి సమ్మిట్ అవార్డును అందుకున్న ఆమె అమరావతిపై ప్రసంసల జల్లు కురిపించింది.


అమరావతి అభివృద్ధి, పచ్చదనం తనను ఆకట్టుకుందని త్వరలోనే మళ్లీ విజయవాడకు వస్తానని దీపిక ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. తెలుగులో మాట్లాడిన ఆమె అభిమానులను అలరించారు. సోషల్ మీడియాలో బాగా యాక్టిగా ఉన్నందుకు దీపికాకు ఈ అవార్డు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఐతే ఇందులో తన గొప్పదనం ఏమీ లేదంటోందీ పద్మావతి.సోషల్ మీడియాలో తన అభిమానులు యాక్టివ్ గా అనుసరిస్తున్నందువల్లే తాను కూడా యాక్టివ్ గా ఉండగలుగుతున్నానని దీపికా అంటోంది. ఏదైనా మనసుకు నచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటానని ఆ నిజాయితీ అభిమానులకు నచ్చడం వల్లే ఇంతమంది ఫాలోవర్స్ తనకు ఉన్నారని అనుకుంటున్నానని దీపికా చెప్పారు. 


వచ్చే ఏడాది ఇదే తరహాలో అవార్డు అందుకోవాలని... అప్పటికి ముంబయి నుంచి నేరుగా విమాన సర్వీసు ఉంటుదని దీపికకు మంత్రి అఖిల ప్రియ హామీ ఇచ్చారు.  ఇదే అవార్డును మన బాహుబలి విలన్ రానా దగ్గుపాటి, కొలవెరి పాటతో పాపులర్ అయిన త్రీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర అందుకున్నారు. ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవాడకు కొత్త కలరింగ్ తెచ్చింది. జాతీయ స్థాయిలో తొలిసారి ఈ సమ్మిట్ ఏర్పాటు చేసిన ఘనత ఏపీకి దక్కింది. దేశంలోని వివిధ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉన్న ముగ్గురు ప్రముఖులతో పాటు సోషల్ మీడియా సాయంతో సామాజిక సేవ చేస్తున్న పలువురికి ఈ అవార్డులు దక్కాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: