ఈ శుక్ర‌వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 10 సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగాయి. ఈ సినిమాల్లో షాకింగ్ ఏంటంటే డ‌బ్బింగ్ సినిమాలు కార్తీ ఖాకి, సిద్ధార్థ్ గృహం హిట్ టాక్ తెచ్చుకుంటే స్ట్రైట్ తెలుగు సినిమాలు అన్ని క‌నీసం రివ్యూలు రాయ‌డానికి కూడా ఛాన్స్ లేకుండా సోదిలోకే రాలేదు. ఈ 10 సినిమాల్లోను మంచి టాక్ తెచ్చుకుని థియేట‌ర్లలో స‌క్సెస్‌గా ర‌న్ అవుతున్న‌వి ఖాకి, గృహం మాత్ర‌మే. 

karthi kaki movie కోసం చిత్ర ఫలితం

ఈ అన్ని సినిమాల్లోకి కార్తీ ఖాకి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌డుతూ దూసుకుపోతోంది. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఖాకి సినిమాకు మాత్రం డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లో ఈ సినిమాకు రూ 3.52 కోట్ల షేర్ వ‌చ్చింది. కార్తీ సినిమాకు ఇక్క‌డ ఈ రేంజ్‌లో షేర్ రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. సినిమాకు మంచి టాక్ రావ‌డంతో పాటు పోటీ సినిమాలు కూడా లేక‌పోవ‌డం ఖాకికి బాగా క‌లిసొచ్చింది.


ఖాకి ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ షేర్ (కోట్లలో)
నైజాం – 1.16
సీడెడ్ – 0.56
ఉత్తరాంధ్ర – 0.5
గుంటూరు – 0.39
ఈస్ట్ – రూ. 0.31
కృష్ణా – 0.30
వెస్ట్ – 0.19
నెల్లూరు – 0.11
----------------------------------- 
ఏపీ+తెలంగాణ షేర్ = 3.52 
----------------------------------- 

karthi kaki movie కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: