తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాన్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో "అజ్ఞాతవాసి" సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించి ఈ మద్య ఓ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది.  మొదటి నుంచి సినిమాపై ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు చిత్ర యూనిట్. 
Image result for pawan trivikram
ఇక పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు..అదేంటో తెలుసా..! పవన్ కళ్యాన్ స్వయంగా పాట పాడటం. గతంలో పవన్ కళ్యాన్ తన సొంతగా పాడిన పాటలు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.  ఇక అత్తారింటికి దారేది చిత్రంలో ‘కాటమ రాయుడా... కదిరి నరసింహుడా’ అనే సాంగ్ కి ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
Related image
తాజాగా మరోసారి పవన్ తన గొంతు వినిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సారి పవన్ "కొడకా కోటేశ్వర రావా.." అంటూ ఫాన్స్ ని అలరించబోతున్నారు.  ఈ చిత్రానికి 'అనిరుద్'  సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే పవన్ అభిమానులు దీన్నొక సెంటిమెంట్గా భావిస్తూ పవన్ కి  బ్లాక్ బస్టర్ వచ్చినంత ఆనందంగా ఉన్నారు.  సినిమా జనవరి 8న సంక్రాంతికి కానుకగా వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: