పవన్ త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈసినిమా ప్రమోషన్ గురించి అదేవిధంగా ఈసినిమా ఆడియో ఫంక్షన్ నిర్వహణ గురించి దర్శకుడు త్రివిక్రమ్ లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ రెండవ వారంలో జరగబోతున్న ఈసినిమా ఆడియో ఫంక్షన్ కు సంబంధించి వేదిక ఎంపిక చేసే విషయంలో రకరకాల సూచనలు త్రివిక్రమ్ దృష్టికి వస్తున్నట్లు టాక్. 

ఈమూవీ ఆడియో ఫంక్షన్ ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న సూచనలు ప్రస్తుతం ఈసినిమా నిర్మాతల పై ప్రభావితం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ ‘జనసేన’ ఎన్నికల రణరంగానికి రాబోతున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతి కీలకంగా మారుతున్న నేపధ్యంలో ఆ ప్రదేశంలోనే ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ పెడితే బాగుంటుంది అన్న సూచనలు ఈసినిమా దర్శక నిర్మాతలను పలువిధాలుగా ఆలోచింప చేసేవిదంగా చేస్తున్నాయని తెలుస్తోంది.

అయితే పవన్ మాత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లోనే పెట్టమని సలహాలు ఇస్తున్నట్లు టాక్. హైదరాబాద్ లోనే ఎక్కడన్నది ఒకటి రెండు రోజుల్లో డిసైడ్ అవుతుంది. పవన్ ప్రస్తుతం రాజకీయపార్టీ నాయకుడుగా కూడ ఉన్న నేపధ్యంలో బహిరంగ ప్రదేశంలో ఆడియో ఫంక్షన్ పెడితే ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే చాలా సమస్యలు వస్తాయని పవన్ ఈసలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలాఉండగా హైదరాబాద్ లో ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ ముగుసిన తరువాత డిసెంబర్ లాస్ట్ వీక్ లో బెంగుళూర్ లో కూడ ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే విశాఖపట్నంలో జనవరి నెలాఖరున బహిరంగ ప్రదేశంలో ‘అజ్ఞాతవాసి’ విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించే ఆలోచనలలో ఈసినిమా యూనిట్ ఉంది అని అంటున్నారు. ఇక చివరిగా ఈ వారం కాశి వెళ్ళుతున్న ఈసినిమా యూనిట్ ఈసినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత కాశి విశ్వేశ్వరుడి కి పూజలు చేయించి ఈసినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: