కలర్స్ స్వాతిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న స్వాతి ఆఇమేజ్ తగ్గ స్థాయిలో హీరోయిన్ గా రాణించలేకపోయింది. మంచినటిగా ఈమెకు పేరున్నా అవకాశాలలో మాత్రం స్వాతి ఎప్పుడూ వెనకపడే ఉంటోంది. ఇలాంటి పరిస్థుతులలో గతవారం విడుదలైన ‘లండన్ బాబులు’ సినిమాలో స్వాతి నటనకు మంచి మార్కులుపడినా ఆసినిమా పెద్దగా విజయవంతం కాలేదు. 

అయితే ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి తన కెరియర్ కు సంబంధించి ముఖ్యంగా ఆమె ఎఫైర్ల గురించి వచ్చినవార్తల గురించి చాలఘాటుగా స్పందించింది.   హీరోయిన్లను జనాలు చూసే దృష్టి మారాలని అంటోంది స్వాతి. సినిమా రంగంలోకి ఎవరు వచ్చినా వాళ్ళ క్యారెక్టర్ని చాలాతప్పుగా చూస్తారని ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదని అంటోంది స్వాతి. 

ముఖ్యంగా తన విషయంలోనూ ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడుకున్నారని అంటూ తాను ఎక్కువగా బయట కనిపించకపోయినా తాను నటించిన చాలామంది హీరోలతో తనకు ముడిపెట్టారని ఆవేదన వ్యక్తపరిచింది ఈకలర్స్ బ్యూటీ.  మొట్టమొదటగా ‘డేంజర్’ సినిమా సమయంలో అల్లరి నరేష్ తో లింకు కలిపారని స్వాతి చెప్పింది. ఆ తర్వాత ‘అష్టాచెమ్మా’ టైంలో నానితో ‘స్వామి రారా’ టైంలో నిఖిల్ తో కూడా ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు వ్రాసారని గగ్గోలు పెడుతోంది స్వాతి. 

ఇదిచాలదు అన్నట్లుగా తాను తమిళంలో సినిమాలు చేసినప్పుడు తనకు కోలీవుడ్ హీరో జైతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వ్రాసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే తనకు ఒక కుటుంబం ఉందని తాను బాధ పడతానని పట్టించుకోకుండా గాసిప్పులు రాయడం మీడియాకు అలవాటుగా మారిందని చురకలు పెట్టింది స్వాతి. అయితే ఇప్పుడు అటువంటి వార్తలను కనీసం చదవడం కూడ మానేసాను అని అంటూ తన పేరు ముందున్న ‘కలర్స్’ అనే పదాన్ని కూడ జనాలు చాలావరకు టీజ్ చేయడానికి ర్యాగింగ్ చేయడానికే ఉపయోగిస్తారని స్వాతి కామెంట్స్ చేసింది. అయితే స్వాతి ఎంతోకష్టపడి తన లుక్ ను నాజూకుగా మార్చుకుని ‘లండన్ బాబులు’ సినిమాలో నటించినా స్వాతికి ఈసారి కూడ కలిసి రాలేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: