మెగా ఫామిలీ హీరోల ఫంక్షన్ లు ఏవైనా సరే ఒకప్పుడు చిరంజీవి నామస్మరణ ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. అదే స్థానం లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. అయితే చిరు గురించి నామస్మరణ మాత్రమె చేసిన మెగా జనాలు పవన్ దగ్గరకి వచ్చే సరికి భజన మొదలు పెట్టారు.

పవన్ కళ్యాణ్ భజన చేస్తూ అసలు ఫంక్షన్ మ్యాటర్ ని గాలికి వదిలేస్తున్నారు అనే అపవాదు లేకపోలేదు. తాజాగా జరిగిన జవాన్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం లో ఆ సినిమా విషయం పక్కకి పెట్టేసి పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడడం మొదలు పెట్టారు.

పవన్ దేవుడు అంటూ రొటీన్ పొగడ్తల తో అష్టోత్తరం , సహస్ర నామ మూజ ఇవన్నీ చేసేసారు. పవన్‌ పేరు చెప్పుకుంటే సినిమాకి ఓపెనింగ్స్‌ అయినా బాగా వస్తాయని, సినిమా ఎలా ఉన్న పవన్‌ అభిమానులు మాత్రం ఆయనను పూజించే శిష్యబృందాల వారి చిత్రాలను తప్పకుండా ఎంకరేజ్‌ చేస్తారు.

నితిన్‌, సప్తగిరి, అలీ వంటి వారి విషయాలలో ఇది నిరూపితమైంది. కాబట్టి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కలెక్షన్లు సాధించాలంటే ఉన్నది ఒకే ఒక్క పవన్‌ అనే ఆయుధాన్నే ఈ సినిమా యూనిట్‌ వాడుకున్నట్లు అర్ధమవుతోంది. ఏదేమైనా అతిగా పోతే అసహ్యం వచ్చేస్తుంది అని అర్ధం చేసుకోవాలి వీరంతా. పవన్ గొప్ప హీరోనే అందులో డౌట్ లేదు కానీ ఓపెనింగ్ ల కోసం పవన్ కళ్యాణ్ జపం చేసేవారిని పవన్ ఫాన్స్ గుర్తించాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: