ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో  ఓ సినిమా తెరపైకి రావాలంటే దానికి వెనుక ఎన్నో ఆర్థిక లావాదేవీలు ఉంటున్నాయి.  ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో డూ ఆర్ డై అనే విధంగా నిర్మాతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.  అయితే వీరి వెనుక పెట్టు బడులు పెట్టడానికి  ఫైనాన్షియర్లు ముందుకు వస్తున్నారు. అదృష్టం బాగుండి సినిమా హిట్ అయితే..మంచి కలెక్షన్లు వస్తే..సరి లేదంటే నిర్మాతలకు కష్టాలు తప్పడం లేదు..ఎందుకంటే వారికి ఫైనాన్స్ చేసిన  ఫైనాన్షియర్లు వేధింపులు ఎక్కువ అవుతుంటాయి.

  ఇది అన్ని ఇండస్ట్రీలో ఉంటున్న బాధలే..తాజాగా  తమిళ ఫిల్మ్ ప్రొడ్యూజర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, హీరో విశాల్ నిర్మాతలను వెధిస్తున్న ఫైనాన్షియర్ల సీరియస్ అయ్యారు. నిన్న పలు చిత్రాలకు, ముఖ్యంగా హీరో శశి కుమార్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహిరించిన బి. అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆయన మరణానికి ఫైనాన్షియర్ల వేధింపులే కారణమని స్పష్టమైంది.

అప్పులిచ్చిన ఫైనాన్షియర్లు వేధింపులకు గురిచేయడం వలనే ఆయన సూసైడ్ చేసుకున్నారని కోలీవుడ్ లో చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై స్పందించిన విశాల్   క్కువ వడ్డీకి అప్పులిచ్చి నిర్మాతల్ని వేదించే ఫైనాన్షియర్ల ఆగడాలు ఇక సాగవని, అలాంటి వారెవరైనా ఉంటే పద్దతిని మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: