తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బిజీ నటుడు ఎవరయ్యా అంటే వెంటనే పోసాని కృష్ణమురళి గుర్తుకు వస్తారు.  ఎందుకంటే ఒకప్పుడు ప్రఖ్యాత మాటల రచయిత, దర్శకుడు, హీరోగా కూడా నటించాడు. గత కొంత కాలంగా వీటన్నింటికీ స్వస్తి చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.  ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు చేసిన పోసాని ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ..కాంట్రవర్సీలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మద్య నందీ అవార్డుల గురించి జరుగుతున్న గొలపై మొన్నటి వరకు పెదవి విప్పలేదు.

Image result for posani boyapati

 కానీ నిన్న మాత్రం  ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు..ముఖ్యంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై  తుప్పురేగిపోయే కౌంటర్లు వేశాడు.  ఇదే సందర్భంగా బోయపాటిపై కూడా వ్యంగాస్త్రాలు సందించారు.  దర్శకత్వంలో అమోఘమైన ప్రతిభ చూపించిన వారికి.. బిఎన్ రెడ్డి 'నంది' అవార్డును అందిస్తుంది ఏపి సర్కార్.  ఓ సినిమా చూస్తే అబ్బా ఈ సినిమా ఎంత ప్రశాంతంగా ఉంది..అహ్లాదంగా ఉందని భావించాలి. కాని 2016కు గాను బోయపాటి శ్రీనుకు ఈ అవార్డు రావడం.. అందరినీ కాసింత విస్మయానికి గురిచేసింది.
Image result for nara lokesh
సినిమా అంతా రక్తపాతం చూపించి.. లాస్టులో ఇది తప్పు అని చెప్పడం బోయపాటి ఆ అవార్డు ఎలా ఇచ్చారో వారికే తెలియాలి.  ''దర్శకుడు ముత్యాల సుబ్బయ్యను ఉదాహరణగా తీసుకోండి. ఆయన సామాజిక స్పృహ సందేశం ఉన్న సినిమాలు ఎన్నోతీశారు.  కలికాలం వంటి సినిమాను చూసి కె విశ్వనాథ్ మెచ్చుకున్నారు.
Image result for muthyala subbaiah
సగటు మనిషి.. అమ్మాయి కాపురం.. అరుణ కిరణం.. అన్న.. పవిత్రబంధం.. పెళ్ళిచేసుకుందాం.. స్నేహితులు.. వంటి గొప్ప సినిమాలను సుబ్బయ్య తీశారు..మరి ఈ బిఎన్ రెడ్డి అవార్డు వచ్చినవాళ్లు ఇలాంటి సినిమా ఒక్కటైనా తెరకెక్కించారా అని ప్రశ్నించారు.  మరి పోసాని వ్యాఖ్యల పై నంది జ్యూరి.. నారా లోకేష్.. బోయపాటి శ్రీను ఎలా రెస్సాండ్ అవుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: