ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుస మరణాలు కంటతడి పెట్టిస్తున్నారు.  సహజమరణాలు కొందరి అయితే..బలవన్మరణాలు మరికొందరి అవుతున్నాయి.  సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కలలు కని వస్తారు..తమ కెరీర్ పీక్ స్టేజ్ కి వెళ్లడంతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తాజాగా ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని అళ్వార్‌ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.   అశోక్ కుమార్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు బంధువు.

శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోవడమే అశోక్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. అప్పులు తిరిగి చెల్లించాలంటూ అప్పిచ్చినవారు వేధిస్తుండటంతో... మనస్తాపానికి గురై, ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. 

అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అశోక్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన యువ హీరో సిద్దార్థ..తమిళ సినీరంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం కేవలం పేరు, సక్సెస్ లను మాత్రమే గుర్తిస్తుంది. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన సమయం వచ్చింది. రైతైనా, దర్శకుడైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రావటం దారుణం'. అంటూ ట్వీట్ చేశారు.






మరింత సమాచారం తెలుసుకోండి: