తెలుగు ఇండస్ట్రీలో జెమిని, సొంతం చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నమిత తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లింది.  అయితే అక్కడ మాత్రం ఈ అమ్మడు బొద్దుగా తయారు కావడంతో తెలుగు లో చాన్సులు తగ్గిపోయాయి.  కాకపోతే తమిళంలో మాత్రం మంచి చాన్సులు దక్కించుకుంది.  ఇక తమిళ తంబీలు నమితకు ఎంత ఫిదా అయ్యారంటే..ఏకంగా ఓ గుడి కట్టించారు.  ఈ మద్య నటుడు శరత్ బాబు తో ఎఫైర్ కొనసాగిస్తుందని..త్వరలో పెళ్లి చేసుకంటారని వార్తలు వచ్చాయి. 

ఈ వార్తలపై ఇద్దరు ఖండించారు.  ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరాను ఈ నెల 24న వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ పెళ్లిపై వీరిద్దరూ స్పష్టతను ఇస్తూ అభిమానుల ఆశీర్వాదాలను కోరుతూ.. ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.తన కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో నమిత తన బాయ్ ఫ్రెండ్ వీర్ (వీరేంద్ర చౌదరి)తో కలిసి తమ వివాహంపై మాట్లాడింది.

తాజాగా వివాహానికి ముందు జరిగే మెహింది ఫంక్షన్‌లో తనకు కాబోయే భర్తతో కలిసి హంగామా చేసింది నమిత. చేతులకు మెహందీ పెట్టించుకుంటూ తన కుటుంబ సభ్యులతో సందడిగా డ్యాన్స్‌ చేసిన వీడియో, ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా నమిత-వీరేంద్ర చౌదరి సంగీత్ ఫంక్షన్ నవంబర్ 22న తిరుపతి సింధూరి పార్క్ హోటల్‌లో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జరగనుండగా.. పెళ్లి నవంబర్ 24 శుక్రవారం తిరుపతి‌లోని ఇస్కాన్‌లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు జరుగనున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: