లక్ష్మీరాయ్ లేటెస్ట్ మూవీ 'జూలీ-2' రేపు దేశవ్యాప్తంగా విడుదలకాబోతోంది. 14 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం రేపిన 'జూలీ' సినిమాకు సీక్వెల్ గా ఈ జూలీ పార్ట్ టూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈసినిమా కథ ఒకనాటి గ్లామర్ హీరోయిన్ నగ్మా జీవితాన్ని పోలి ఉంటుంది అని వార్తలు రావడంతో ఈమూవీ పై అందరకీ ఆసక్తి పెరిగిపోయింది. అయితే ఈసినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్న ఈసినిమా దర్శక నిర్మాతలు ఏకంగా ఈసినిమాను ప్రమోట్ చేయడానికి మెగా స్టార్ చిరంజీవిని రంగంలోకి దింపడం హాట్ టాపిక్ గా మారింది. 
మెగాస్టార్ చిరంజీవి
ఈప్రయత్నాలలో భాగంగా లక్ష్మీరాయ్‌కి ‘జూలీ-2' చిత్ర యూనిట్‌ కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియో ద్వారా తన విషెస్ ను తెలిపాడు. ఇప్పుడు ఈవిషయమే హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా తనపని తాను చేసుకుపోయే మెగా స్టార్ పర్సనల్ గా హెల్ప్ చేయటం లాంటివి చేస్తాడు కాని పెద్దగా ఇతరుల సినిమాలకి ప్రచారం చేసి పెట్టాడు. 

అలాంటిది లక్ష్మీరాయ్ నటిస్తున్న ఒక వివాదాల సినిమాకు చిరంజీవి ఎలా ప్రమోట్ చేస్తున్నాడు అన్న ఆశ్చర్యం కొందరిలో కలుగుతోంది. ఈ వీడియోలో చిరంజీవి లక్ష్మీరాయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ‘హాయ్ రాయ్ లక్ష్మీ. బాలీవుడ్‌లో నీ మొదటి సినిమా విడుదలకానున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా నీకు చాలా ప్రత్యేకమైనదని తెలుసు. నీ సినిమా కెరియర్‌లో ఇది 50వ చిత్రం. నీలో ఉన్న టాలెంట్‌ని, నీలో దాగిఉన్న శక్తిని ఈ సినిమా బయటపెడుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. జూలీ 2 విడుదల సందర్భంగా మరొక్కసారి నీకు శుభాకాంక్షలు. గుడ్ లక్ టు జూలీ 2. లవ్ యు టు' అంటూ తన సందేశాన్ని ముగించాడు. 

ఈవీడియో సందేశాన్ని చూసిన కొందరైతే ‘ఖైదీ నెంబర్ 150’ లో తనతో ‘రత్తాలు’ ఐటమ్ సాంగ్ చేసిన లక్ష్మీరాయ్ కి ఈవిధంగా కృతజ్ఞత తీర్చుకుంటున్నాడు అంటూ జోక్ కూడ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నగ్మాతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన చిరంజీవి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాల పై ఈసినిమా తీసారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈసినిమాను చిరంజీవి ప్రమోట్ చేయడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: