భారత దేశంలో పెను సంచలనాలకు కేంద్ర బింధువు అయ్యింది..‘పద్మావతి’ సినిమా.   పద్మావతి చిత్రం విడుదలపై ఓ వైపు ఇండియాలో ఆందోళనలు కొనసాగుతుండగా.. బ్రిటన్‌లో ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సినిమాకు 'యూ' రేటింగ్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీన విడుదల చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఆ రోజున యూకేలో విడుదల చేయడానికి 'పద్మావతి' నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. ఇండియన్ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు బ్రిటీష్ థియేటర్లలో సినిమాను విడుదల చేయబోమని వారు స్పష్టం చేశారు.

Image result for padmavati movie

వాస్తవానికి భారత్‌లోనూ డిసెంబర్‌ 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, రాజ్‌పుత్ కర్ణసేన ఉత్తరాది రాష్ట్రాల్లో పద్మావతి రిలీజ్‌ను అడ్డుకుంటున్నాయి. గుజరాత్‌లో ఏకంగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ సినిమా విడుదలను నిలిపేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రకటించారు. రాజపుత్రుల మనోభావాలను దెబ్బతీసే ఈ చిత్రాన్ని గుజరాత్‌లో విడుదల కానివ్వం. భావప్రకటన స్వేచ్ఛపై మాకు విశ్వాసం ఉంది. కానీ చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు’ అని విజయ్‌ రూపానీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Image result for padmavati movie
అయితే ‘పద్మావతి’ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటున్నారు చిత్ర యూనిట్.  ఒకానొక సందర్భంలో దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ పై కొంత మంది చెయి చేసుకున్నారు.  మరోసారి సెట్టింగ్ తగుల బెట్టారు..ఇలా ఎన్నో వివాదాలు సృష్టిస్తున్న  పద్మావతి' సినిమాను రూ. 190 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ తదితర స్టార్లు ఈ సినిమాలో నటించారు. భన్సాలీ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా, అంతర్జాతీయంగా పారామౌంట్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: