నవంబర్‌ 22న  "పద్మావతి" సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సింగిల్‌ కట్‌ లేకుండా విడుదల కాబోతుండటం విశేషం. ఈ మేరకు "బీబీఎఫ్‌సీ" తన అధికారిక వెబ్-సైట్ లో పేర్కొంది. చిత్ర నిడివి 124 నిమిషాలుగా పేర్కొంటూ 12ఆ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. ఈ అనుమతి భారత్ లో కాదు. బ్రిటన్‌లో ఈ చిత్ర విడుదలకు అనుమతి లభించింది. డిసెంబర్‌ 1న ఈ చిత్రం యూకేలో విడుదల అవుతున్నట్లు బ్రిటీష్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్స్‌ క్లాసిఫికేషన్‌(బీబీఎఫ్‌సీ) ప్రకటించింది.

padmavati permitted to release in uk bbfc కోసం చిత్ర ఫలితం

భారత్‌లో శ్రీ రాజపుత్ కర్ణి సేన నిరసనలు, సి బి ఎఫ్ సి - భారతీయ సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ జారీ చేయటంలో తాత్సారం నడుమ పద్మావతి చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. 190 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా, దీపిక పదుకొనే, షాహిద్‌ కపూర్‌, రణ్‌ వీర్‌ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.


అయితే చిత్రాన్ని గ్రేట్ బ్రిటన్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. భారత్‌ లో కూడా విడుదలకు అడ్డంకులు తొలిగిన తరవాతే ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ నిర్మాతలు తమ ప్రకటనలో తెలిపారు. 

allauddin khilji in padmavati కోసం చిత్ర ఫలితం

సంజయ్ లీలా బన్సాలి కథలో చేసిన మార్పేమన్ టే అల్లావుద్దీన్‌ ఖిల్జీ పద్మావతి కోసం కాకుండా,  పద్మావతే అల్లావుద్దీన్‌ ఖిల్జీ పొందు కోసం కలలు కంటున్నదని, తన కలలో అల్లావుద్దీన్‌తో ఆమె సరససల్లాపాలాడే ఒక సన్నివేశం చిత్రంలో వున్నదని ఆ చిత్ర  వ్యతిరేకుల వాదన కాగా, అలాంటి సన్నివేశమే చిత్రంలో లేదని సంజయ్ భన్సాలీ సమాదానం. సంజయ్ నిజం గా కథని వక్రీకరిస్తే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు కూడా ప్రమాదకారులే అవుతారు. భారత జాతి విశ్వాసంపై దెబ్బ కొట్టరనే నమ్ముదాం. చివరికి రేపు డిసెంబర్‌ 1వ తేదీన విడుదల కావలసిన ‘పద్మావతి’ విడుదలను భన్సాలీ నిరవధికంగా వాయిదా వేశాడు.

alauddin khilji history కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: