నాగార్జున చిరంజీవిల మధ్య మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అనేక వ్యాపార సంస్థలలో కూడ భాగస్వాములుగా విజయవంతమైన వ్యాపారాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం నాగార్జునతో పెద్దగా సాన్నిహిత్యం కొనసాగించడు.

ఇటువంటి పరిస్థుతులలో పవన్ చేతిలో ఏఎన్ఆర్ హిస్టరీకి సంబంధించిన పుస్తకాన్ని ‘అజ్ఞాతవాసి’ సెట్ లో చూసిన చాలామంది ఆశ్చర్యపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పుస్తకాలు అంటే బాగా ఇష్టపడే పవన్ ఈ మధ్య ఏ ఎన్ఆర్ హిస్టరీకి సంబంధించి ఒక పుస్తకానికి ఇచ్చిన ప్రాముఖ్యత చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే సినీ పరిశోధకుడు సంజయ్‌ కిషోర్  ఏఎన్ఆర్ లైఫ్‌స్టోరీపై ఓ బుక్ రాశారు. 

గతనెల ఉపరాష్ర్టపతి చేతుల మీదుగా ఈ పుస్తకం రిలీజయ్యింది. అయితే పవన్, త్రివిక్రమ్‌ పై ఉన్న అభిమానంతో ఈ రచయిత రెండు కాపీలను తీసుకొచ్చి వాళ్లకి ‘అజ్ఞాతవాసి’ సెట్స్‌‌లో అందజేశారు. కానీ పవన్ చేతుల మీదుగా ఈ బుక్ రిలీజ్ అయినట్లు మీడియాలో హడావిడి కనిపించింది. నాగేశ్వరరావు నటన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివరాలూ అందు‌లో ప్రస్తావించారు.

ఇప్పటికే ఏఎన్ఆర్‌పై ఎన్నో పుస్తకాలు వచ్చాయి కానీ మరి ఇందులో కొత్త అంశాలు ఏమిటి అన్న విషయం పై చర్చలు జరుగుతున్నాయి. ఒకరకంగా అక్కినేని పై పుస్తకం రావడం అక్కినేని అభిమానులకు శుభవార్తగా మారినా నాగార్జున కుటుంబ సభ్యుల చేతులలో కాకుండా ఇలా వేరే ప్రముఖ హీరోల చేతులలో ఇప్పుడు ఈ పుస్తకం కనిపించడం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ దీనివెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: