మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ మూవీ ప్రారంభం చిరంజీవి పుట్టినరోజునాడు జరిగినా ఈమూవీ అసలు షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అనేకవార్తలు ఈసినిమా పై వస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 6న షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీకి సంబంధించి ఒకకీలక పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి పై నిన్న ఒక టెస్ట్ షూట్ తీసినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మరొక రెండు రోజులలో సీనియర్ స్టార్ నాజర్ పై కూడ ఈసినిమాకు సంబంధించి టెస్ట్ షూట్ ను నిర్వహించబోతున్నారు.

ఇప్పటికే చిరంజీవి పై టెస్ట్ షూట్ తీసిన దర్శకుడు సురేంద్ర రెడ్డి ఇప్పుడు సీనియర్ నటుడు నాజర్ కు అదేవిధంగా విజయ్ సేతుపతికి పరీక్షలు పెట్టడం వారు దానికి అంగీకరించడం చిరంజీవి పై ఉన్న గౌరవాన్ని సూచిస్తోంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా చిరంజీవి ఈసినిమాకు సంబంధించి నటించే ప్రతి నటుడు లుక్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఆ నటుడు లుక్ గురించి సురేంద్ర రెడ్డి చరణ్ లతో చాల లోతైన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ‘సైరా’ లో అమితాబ్, జగపతిబాబు, సుదీప్ వంటి నటీనటులు ఎంపిక కాగా, ఈ జాబితాలోకి భోజ్‌పురి స్టార్ రవికిషన్ కూడ చేరిపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో ‘రేసుగుర్రం’ లో నటించిన ఈవిలక్షణ నటుడుకి ‘సైరా’ లో కీలక పాత్ర ఇవ్వడమే కాకుండా అతడి పై కూడ టెస్ట్ షూట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక త్వరలో సునీల్ పై కూడ సురేంద్ర రెడ్డి టెస్ట్ షూట్ చేస్తాడని సమాచారం.

ఇలా ‘సైరా’ కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ చిరంజీవి చాల జాగ్రత్తలు తీసుకుంటున్న నేపధ్యంలో ఈమూవీ రిలీజ్ గురించి ఖంగారు పడవద్దని 2019 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ‘సైరా’ ను విడుదల చేద్దామని సూచిస్తున్నట్లు టాక్. దీనితో 2018 అంతా ‘సైరా’ నిర్మాణానికి సంబంధించిన వార్తల హడావిడి కనిపిస్తుంది కాని ఈసినిమా విడుదల ఉండదు అన్న వార్తలు ఊపు అందుకున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: