టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘సూపర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించింది.  ఈ అమ్మడు గ్లామర్ కే ప్రాధాన్యత ఇవ్వకుండా అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరయ్యింది.   సాధారణంగా ఓ నిర్మాణ సంస్థ వరుస విజయాలు అందుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. 

Image result for rudramadevi anushka

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి ఆరు చిత్రాలను హిట్ చిత్రాలుగా నిలిపిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.  ప్రభాస్ సన్నిహితులు అయిన ప్రమోద్-వంశీలు.. యంగ్ రెబల్ స్టార్ తో తీసిన మిర్చి మూవీతో జర్నీ స్టార్ట్ చేసి.. తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్, ఎక్స్ ప్రెస్ రాజా,మహానుభావుడు లాంటి సినిమాలతో వరుసగా విజయాలు సాధించారు.  

Image result for size zero anushka

ట్విస్ట్ ఏంటంటే ఒక్క మిర్చి సినిమా తప్పా అన్నీ కామెడీ ని నమ్ముకొని తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం. అయితే ఇప్పుడు మొదటి సారి ఓ సాహసం చేస్తున్నారు..యూవి క్రియేషన్స్.  అనుష్క ప్రధానపాత్రలో నటించగా పీరియాడిక్ కాన్సెప్ట్ తో.. సోషల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న భాగమతి సినిమాను తెరకెక్కిస్తున్నారు..అదీ తమకు అచ్చొచ్చిన సంక్రాంతి రేస్ లోనే రిలీజ్ చేయడానికి సిద్దం చేశారు.  

Image result for baahubali devasena

కాకపోతే ఈ మద్య అనుష్క  సోలోగా సక్సెస్ సాధించడంలో మాత్రం విఫలమైంది. అంతే కాదు ‘భాగమతి’కి పోటీగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి.. బాలయ్య జై సింహాల సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలతో పోటీ పడి భాగమతి సక్సెస్ సాధిస్తుందా..లేదా అనేది డౌట్.  ఈ చిత్రంపై 40 కోట్ల పెట్టుబడి చేసింది యూవీ క్రియేషన్స్. మరి ఈ నిర్మాతలను అనుష్క ఆదుకుంటుందా..ముంచుతుందా..? సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: