పద్మావతి నిజమైన రాణి పద్మిని కథ కాదు ఒక ఫాంటసి అంటే కల్పిత కథగా చేస్తే సినిమా విడుదలకు ఇబ్బంది ఉండక పోవచ్చు. 13-14వ శతాబ్దం నాటి కథ అని కొందరు, అది ఓ కల్పిత కథ అని ఇంకొందరు, "రాణి పద్మిని" గురించి చాలా కాలంగా చాలా చాలా రచ్చ జరుగుతోంది. "చిత్తోర్‌ఘడ్‌" సంస్థానాధీశుడు రాణా రతన్‌ సింగ్‌ భార్య రాణి పద్మిని  జీవితమే 'పద్మావతి' సినిమా అన్న ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అసలు, పద్మావతి కావొచ్చు, రాణి పద్మిని కావొచ్చు, అలాంటి చరిత్రే లేదన్నది కొందరు చరిత్రకారుల వాదన. అసలు సింపుల్ గా బాహుబలి లాంటి కథ అని చెప్పేసినా సరిపోతుంది. 

Image result for padmavati

రెండు మూడు రాష్ట్రాల్లో ‘పద్మావతి’ నిషేధించే వరకు పరిస్థితి వెళ్లింది. మరోవైపు ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సెన్సార్ బోర్డు దగ్గర కూడా సమస్యలు తలెత్తడంతో డిసెంబరు 1 నుంచి ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడీ కొత్త కథ ఏంటంటారా.? 'పద్మావతి' వివాదంలో నిజం గానే ఇదొక పెద్ద ట్విస్ట్‌. ఆనాటి ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ రాజ్‌ పుత్‌ కర్ణి సేన ఆందోళన బాట పట్టిన దరిమిలా, అది కల్పితం, అనే ప్రచారం తెరపైకి తీసుకు రావడం ద్వారా 'పద్మావతి' సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకోవాలన్న ఆలోచనే, ఈ కొత్త కథలోని అసలు కోణం అనుకోవాలేమో.

Image result for padmavati


అసలు 'పద్మావతి' సినిమాలో ఏముందో తెలియక జనం జుట్టు పీక్కునే పరిస్థితి దాపురిస్తే, కొత్తగా అది చరిత్రా.? కల్పిత కథా.? అన్న కొత్త అనుమానాలేంటట.? ఏమోగానీ, 'పద్మావతి' సినిమాకైతే 140 కోట్ల రూపాయలమేర ఇన్స్యూరెన్స్‌ వుందట. సినిమా విడుదలై దారుణంగా దెబ్బతినేసినా, నష్టమేమీవుండదన్నది సినీ వర్గాల నుంచి వెల్లడవు తోన్న వాస్తవం. 


Image result for padmavati

ఐతే ఈ పరిణామాల్ని ముందే ఊహించాడో ఏమో, బన్సాలీ ‘పద్మావతి’ కి రూ.140 కోట్లకు ఇన్సూరెన్స్ చేసి పెట్టడం విశేషం. రూ.180 కోట్లతో ‘పద్మావతి’ రూపొందగా రూ.140  కోట్లకు బీమా చేయించడం విశేషం. ప్రభుత్వం నిషేధిస్తే తప్ప ఏ రకంగా అయినా ఈ సినిమాకు ఆటంకాలు కలిగినా, ఇది విజయవంతం కాకపోయినా బీమా చెల్లించేలా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం జరిగిందట. 
Image result for padmavati

కాబట్టి బన్సాలీ కొంత వరకు సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఏవో కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధించినప్పటికీ,  దేశమంతా ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఐతే ఏ ఫిలిం మేకర్ కూడా తన సినిమాకు ఏదో ఆటంకం ఏర్పడి బీమా డబ్బులు తీసుకోవాలని అనుకోడు. అందులోనూ ఎంతో  "పాషన్" తో  తీసిన  ‘పద్మావతి’  లాంటి సినిమాలు జనాలు చూడాలనే కోరుకుంటారు. అందుకే వివాదాలన్నీ సద్దుమణిగి త్వరలోనే తన సినిమా విడుదలవుతుందని బన్సాలీ ఆశిస్తున్నాడు.
Image result for padmavati

సినిమా ఇప్పుడు కాకపోతే ఇంకో నెల రోజుల తర్వాత, లేదంటే మూడు నెలలు, ఆరు నెలల తర్వాతైనా విడుదలై తీరుతుంది. మరీ 'అభ్యంతరాలు' ఎక్కువైతే, వాటిని నిర్మాత పరిగణన లోకి తీసుకుంటే కొన్ని సన్నివేశాలకు కట్ పడొచ్చు కూడా. ఎలా గోలా సినిమా విడుదలైతే నిర్మాతకు పెద్దగా నష్టం వుండకపోవచ్చన్నది 'ఇన్స్యూరెన్స్‌' ద్వారా క్లియర్‌ అవుతున్న విషయం.  అంతా బాగానే వుందిగానీ పద్మావతి అనేది జీవిత చరిత్ర అనుకోవాలా.? కల్పిత కథ అనుకోవాలా.? మళ్ళీ ఇప్పుడు కొత్తగా చరిత్ర కారుల్ని తీసుకొచ్చి, చరిత్ర తవ్వించాలేమో. 

Image result for sanjay leela bhansali

మరింత సమాచారం తెలుసుకోండి: