రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న నిరసన ఉద్యమాల నేపధ్యం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బందీగా మార్చి వేసింది అంటున్నారు. హీరో రామ్ చరణ్ తో బహిరంగ పోటీ లేకుండా చేసుకుందామని తాను ఎంత ప్రయత్నిస్తున్నా పరిస్థుతులు మళ్ళీ వీరిద్దరి సినిమాల పోటీ వైపు తీసుకు వెళ్ళడం పవన్ ను చికాకు పెడుతోందట. కోస్తా ఆంధ్రలో నిరసన ఉద్యమాలు జరుగుతున్న మెగా కుటుంబ సినిమాలను విడుదల కానివ్వం అని హెచ్చరికలు వస్తున్నా ధైర్యం చేసి ‘అత్తారింటికి దారేది’ సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేద్దామని ప్రయత్నిస్తున్నా ఈ సినిమాను కొన్న కోస్తా ఆంధ్రా ప్రాంతాల బయ్యర్లు ఈ సినిమాను అనుకున్న తేదీకి కాకుండా వాయిదా వేయమని ఈ సినిమా నిర్మాత భోగవల్లి ప్రసాద్ పై ఒత్తిడి పెరగడంతో ఏమిచేయాలో తెలియని అయోమయ స్థితిలో పవన్ పడిపోయాడు అని అంటున్నారు.

నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యులనుండి ప్రశంసలతో పాటు U సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాను కోస్తా జిల్లాలలో జరుగుతున్న ఉద్యమం వలన ఆగస్టు 14 తారీకు న విడుదల అయితే ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటింపబడి ఈ నెల 21న రాబోతున్న రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాతో మళ్ళీ ధియేటర్ కస్టాలుతో పాటు కుటుంబ సభ్యుల మధ్య అబిప్రాయా భేదాలు మళ్ళీ తారాస్థాయికి చేరుకుంటాయని పవన్ ఆలోచిస్తూ దీనికి పరిష్కారం ఏమిటి అనే వైపు పవన్ నిర్మాత ప్రసాదుల ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థుతుల ఇలా ఉండగానే పవన్ కళ్యాణ్ తన సినిమా ‘అత్తారింటికి దారేది’ కి సంబందించి ఒక స్పెషల్ చారిటి షో హైదరాబాద్ కుకట్ పల్లిలోని విశ్వనాద్ దియేటర్లో ఏర్పాటు చేయడానికి పవన్ అనుమతించాడని ఈ షో ద్వారా వచ్చే డబ్బుతో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి పవన్ అభిమానులు చేస్తున్న ప్రయత్నాలకు పవర్ స్టార్ సహకరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ షోకు పవన్ కళ్యాణ్ తో పాటు టాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ చారిటి షోకు రాబోతున్నారని టాక్. పవన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం తన చేతిలోలేని పరిస్థుతుల మధ్య బందీగా అయిపోయాడని అనుకోవాలి...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: