ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'శ్రీ రంజిత్ మూవీస్' రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం 'అంతకుముందు ఆ తరువాత' ఆగస్టు నెలలోనే విడుదల కాబోతోంది. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు.  ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగిశాయని ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.     

'అంతకుముందు ఆ తరువాత' యువతరం ప్రేమను వెండితెరపై సరికొత్తగా చూపించే చిత్రమని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. చిత్ర సంగీతం విజయాన్నిఅందుకున్న నేపధ్యంలో విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందన్న నమ్మకాని వ్యక్తం చేసారు. చిత్ర కధలోని వాస్తవికత ఉట్టిపడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు, అనుభవాల సమ్మిళితమయిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని అన్నారు. 

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో..రవిబాబు,రావురమేష్,ఉప్పలపాటి నారాయణరావు,అవసరాల శ్రీనివాస్,తాగుబోతు రమేష్, కల్యాణిమాలిక్, పమ్మి సాయి,సోహైల్,కె.ఎల్.ప్రసాద్, రోహిణి,మధుబాల,ప్రగతి,ఝాన్సీ,సుదీప,మాధవి,స్నిగ్ధ,అర్చన,అపర్ణ శర్మ నటిస్తున్నారు

.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: