ప్రస్తుతం రాజకీయ దుమారం లేపుతున్న పవన్ కామెంట్స్ తన ‘జనసేన’ కు ఎంత వరకు మేలు చేస్తాయో తెలియదు కానీ పవన్ గత రెండు రోజులుగా అత్యంత ఆవేశంగా హేసిన కామెంట్స్ చిరంజీవికి అదేవిధంగా అల్లుఅరవింద్ కు తలనొప్పిగా మారుతున్నాయి అన్న కామెంట్స్ కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతానికి చిరంజీవిని రాజకీయంగా విమర్శించే వాళ్ళు ఎవ్వరు లేరు.
కుల నాయకుడిగా చెబితే ఊరుకునేది లేదు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయలలో ఆయనను ప్రశ్నించే వారులేరు. వ్యక్తిగతంగా కూడ చిరంజీవి  రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా కామ్ గా ఉంటూ తన సినిమాల వ్యవహారాలను చూసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో పవన్ మళ్ళీ తన అన్నయ్యను రాజకీయ విమర్శలలోకి లాగుతున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఎప్పుడో మర్చిపోయిన ‘ప్రజారాజ్యం’ విషయాలను ఇప్పుడు జనానికి మళ్ళీ గుర్తుకుచేయవలసిన విషయం ఏముంది అంటూ మరికొందరి వాదన.
కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు
మీడియా ముందుకు వచ్చి పవన్ మాట్లాడాలి అంటే ఎన్నో ప్రజా సమస్యలు ముఖ్యంగా పోలవరం, ప్రత్యేక హోదా, తెలుగుదేశం ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇలా ఎన్నో అంశాలు ఉండగా అవన్నీ వదిలేసి పవన్ ప్రజారాజ్యం పరకాల ప్రభాకర్ అల్లు అరవింద్ మిత్ర అని గడిచిపోయిన చరిత్రలు ఎందుకు తీస్తున్నాడు అంటూ చిరంజీవి సన్నిహితులు కూడ బాద పడుతున్నట్లు టాక్. ఇది చాలదు అన్నట్లుగా ‘ప్రజారాజ్యం’ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో తాను నిస్సహాయుడిని అని పవన్ కళ్యాణ్ చెపుతూ ఆసమయంలో అల్లు అరవింద్ తనను ఓ నటుడిలా చూశాడని అనడం వెనుక పవన్ ఉద్దేశాలు ఏమిటి అన్న విషయం పై కూడ చర్చలు జరుగుతున్నాయి.
కాపును కాదు, భారతీయుడ్ని
అంతేకాదు కాపు రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ విందు భోజనం పెడతానని ఆవకాయ బద్ద నాలుకకు రాసినట్లు ఉంది అని పవన్ చేస్తున్న కామెంట్స్ ఏమాత్రం క్లారిటీ లేకుండా కేవలం అతడి ఆవేశాన్ని సూచించే విధంగా మాత్రమే ఉంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. అయితే పవన్ అభిమానులు మాత్రం తన మాటలతో రెచ్చిపోతున్న పవన్ చూసి ‘సిఎం పవన్’ అంటూ చేస్తున్న కామెంట్స్ తో పవన్ ను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్న విశ్లేషణలు కూడ వినిపిస్తున్నాయి. ఈ టూర్ వల్ల పవన్ ‘జనసేన’ కు ఎంత వరకు సహాయపడుతుందో తెలియకపోయినా సంక్రాంతికి రాబోతున్న తన ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రమోషన్ కు ఇన్ డైరెక్ట్ గా పవన్ మ్యానియా బాగా ఉపయోగపడుతుంది అని సినిమా విశ్లేషకుల భావాన.. 


మరింత సమాచారం తెలుసుకోండి: