టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా  ఎంట్రీ ఇచ్చారు.  ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఒకటీ రెండు తప్ప అన్నీ సూపర్ హిట్ చిత్రాలు కావడం విశేషం.  గత సంవత్సరం ‘ధృవ’ తో మంచి విజయం అందుకున్న రాంచరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తున్నారు.  అయితే ఈ సినిమాలో చరణ్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడరట.  ఇప్పటి వరకు స్మార్ట్ లుక్ తో కనిపించిన చెర్రీ గుబురు గడ్డంతో కనిపించనున్నాడట.  ఇప్పటి వరకు ఈ తరహా సబ్జెక్ట్ కూడా తెరపై రాలేదని చిత్ర యూనిట్ అంటున్నారు.

Related image

అయితే ఈ షూటింగ్ మొదలు పెట్టి చాలా టైమ్ అయినా ఫస్ట్ లుక్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు.  చిత్రానికి సంబంధించిన లోకేషన్ పిక్చర్స్ తప్ప ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. దీంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి రీసెంట్ గా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు తెగ హడావుడి చేశారు.  గత కొంత కాలంగా ఎంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రంగస్థలం’ ఫస్ట్‌లుక్ విషయంతో మరోసారి మాట తప్పింది మైత్రీ మూవీ మేకర్స్. 

Image result for rangasthalam
 కాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను మొదట డిసెంబర్‌ 8 సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించి తరువాత వాయిదా వేసింది. దీంతో మెగా అభిమానుల్లో కొంత అసంతృప్తి నెలకొనడంతో తాజాగా డిసెంబర్‌ 9 (శనివారం) ఉదయం 9గంటలకు ‘రంగస్థలం 1985’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చేసింది చిత్రయూనిట్.దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను ‘లహరి’ మ్యూజిక్ రూ.1.6 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: