తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ కారు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. చెన్నై నుంచి మహాబలిపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.  ఈ యాక్సిడెంట్‌లో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా.. కారులో ప్రయాణిస్తున్న గౌతమ్‌తో పాటు డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గౌతమ్ మీనన్‌ను దగ్గర్లోని హాస్పటల్‌కు తరలించారు. 
Image result for gautham menon
ఈ ప్రమాదం లారీ డ్రైవర్ తప్పదంతోటే జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉండటంతో అతనిపై కేసును నమోదు చేశారు. ప్రమాద సమయంలో గౌతమ్ మీనన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ మద్యం సేవించిలేరని పోలీసులు తెలిపారు. కాగా, తమిళం, తెలుగు భాషలలో పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

తెలుగులో ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావే’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం హీరో విక్రమ్ తో ‘ధ్రువ నక్షత్రం’తో పాటు, సందీప్ కిషన్ హీరోగా తమిళంలో ‘నరగసూరన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’గా విడుదల కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: