నాచురల్ స్టార్ నాని క్రేజ్ ఏంటి అన్నది ఆయన సినిమాల ఫలితాలు చూస్తే తెలుస్తుంది. ఎవడే సుబ్రమణ్యం సినిమా నుండి నిన్ను కోరి దాకా నాని డబుల్ హ్యాట్రిక్ కూడా ఫినిష్ చేశాడు. ఇక రాబోతున్న ఎం.సి.ఏ కూడా హిట్ పక్కా అనేస్తున్నారు పరిశ్రమ వర్గాలు. ఇక హీరోగా సూపర్ ఫాంలో ఉన్న నాని మొదటిసారి పూర్తిస్థాయి నిర్మాతగా మారుతున్నాడు.


అ!.. అంటూ నాని చేస్తున్న ప్రయోగం గురించి ఇండస్ట్రీ అంతా చర్చించుకుంటుంది. కాజల్, రెజినా, నిత్యా మీనన్, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో ఐదు కథలు ఉంటాయట. ఎవరికి వారు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటారట. ఈ ఐదుగురి కథలు ఒక చోటకి వచ్చి చేరుతాయట. 


మరి చివరకు ఈ ఐదుగురికి సంబంధం ఉంటుందా లేక వారి కథలు అలానే ముగుస్తాయా అన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో నానితో పాటు మాస్ మహరాజ్ రవితేజ కూడా వాయిస్ ఓవర్ అందిస్తున్నాడని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు నాని. ఇప్పటికే సినిమా షూటింగ్ అధికభాగం పూర్తి చేసుకుందట.


ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో నాని నిర్మిస్తున్న ఈ అ! తనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. సినిమా నుండి రిలీజ్ అయిన నిత్య, అవసరాల శ్రీనివాస్ లుక్స్ మరింత క్రేజ్ తెస్తున్నాయి. మరి హీరోగా నాని సూపర్ హిట్స్ కొడుతున్న ఈ టైంలో నిర్మాతగా ఎలాంటి ఫలితం దక్కించుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: