తెలుగు ఇండస్ట్రీలోకి ‘మౌన పోరాటం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యమున తర్వాత మంచి కథాబలమున్న చిత్రాల్లో యమున నటించారు.  బరువైన పాత్రల్లోనూ ఆమె మెప్పించగలదని నిరూపించారు.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. " నా అసలు పేరు 'ప్రేమ' .. నా మొదటి సినిమా 'సిస్టర్ నందిని' షూటింగ్ సమయంలో బాలచందర్ గారు 'యమున'గా మార్చారు" అని అన్నారు. 
Image result for actress yamuna mouna poratam
ఆ సినిమాలో నేను స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సుహాసినికి చెల్లెలుగా నటించాను...సినిమా మంచి హిట్ అయ్యింది.  అయితే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లో బాలచందర్ మెమెంటో ఇవ్వడానికి నన్ను స్టేజ్ మీదకి పిలిచి, 'భవిష్యత్తులో ఈ అమ్మాయి నాకు డేట్స్ ఇవ్వనంత బిజీ అవుతుంది' అన్నారు.  'మౌన పోరాటం' తరువాత అదే బ్యానర్లో రెండు సినిమాలు కమిట్ కావడం జరిగింది.
Image result for actress yamuna mouna poratam
ఆ గ్యాప్ లో వేరే సినిమాలు వచ్చినా చేయలేకపోయాను.  అప్పట్లో మోహన్ బాబు సూపర్ హిట్ చిత్రం ‘అల్లుడుగారు’ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో నేను నటించాల్సి ఉంది..కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర చేయలేక పోయాన్నన్నారు.

ఆ పాత్ర నిడివి గురించి నేను ఆలోచించాను గానీ, రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తే ఎంత హైప్ వస్తుంది .. మోహన్ బాబుతో సినిమా చేయడం వలన ఎంతమంచి పేరు వస్తుంది అనే విషయాలను గురించి నేను ఆలోచించలేదు.  ఆ సినిమా చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ వుంది  అంటూ చెప్పుకొచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: