తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  ఈయన వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన పది సంవత్సరాలు దాటింది.  ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో మంచి సక్సెస్ సాధించిన చైతూ తన సహనటి అయిన సమంతను ఈ మద్య ప్రేమ వివాహం చేసుకున్నాడు.  ఇప్పటి వరకు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ మాత్రం చైతూ సొంతం చేసుకోలేక పోయాడు.
Related image
వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు..కానీ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేక పోయింది.  ప్రస్తుతం ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్.  అయితే అఖిల్ రెండవ సినిమా మంచి హిట్ కావడం కోసం స్వయంగా నాగార్జున్ రంగంలతోకి దిగారు..ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
Image result for hello movie stills
తాజాగా అఖిల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన చిత్రం 'హ‌లో' చిత్రంలోని 'మెరిసే మెరిసే' లిరిక‌ల్ వీడియోని..  అఖిల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో విడుద‌ల చేశారు.  . మెలోడీగా సాగే ఈ పాట‌కి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం అల‌రించేలా ఉంది. సాహిత్యం కూడా బాగా కుదిరింది. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, అజ‌య్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ నెల 22న తెర‌పైకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: