ముకుందా, కంచె, ఫిదా అంటూ సెలక్టివ్ ఫిల్మ్స్ ను సెలక్ట్ చేసుకుని సక్సెస్ సాధించిన హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు ఈ అబ్బాయి.. బాబాయి తొలిప్రేమ తో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు. రిలీజ్ చేసింది ఒక్క ఫస్ట్ లుక్.. కానీ అప్పుడే 30కోట్ల దాక మార్కెట్ చేసేశాడు వరుణ్. ప్రెజెంట్ ఇదే... టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. అంతేకాదు.. ఆ ఫస్ట్ లుక్ వెనక పెద్ద లాజిక్కే ఉంది. ప్రెజెంట్ వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ తొలిప్రేమ. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన తొలిప్రేమ ట్రెండ్ సెటర్ గా నిలిచింది. అంతేకాదు.. ఆ తొలిప్రేమతోనే పవన్ కు యూత్ లో క్రేజ్ సంపాదించి పెట్టింది. అందులోని పాటలకు, పవన్ యాక్షన్ సీన్లకు యూత్ ఫిదా అయిపోయారు.

Image result for varuntej tholiprema

తొలిప్రేమ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు వరుణ్ తేజ్. మీరు గమనించి చూస్తే ఈ ఫస్ట్ లుక్ లో ఫ్యామిలీ లాజిక్ ఉంది. ఫస్ట్ లుక్ లో కనిపిస్తున్న మరో స్పెషల్ ఏంటంటే... రైల్వేస్టేషన్... ప్లాట్ ఫామ్ పై బెంచ్.. దాని పైన వరుణ్. కొన్నేళ్ళు వెనక్కెళ్తే.. సేమ్ సిట్యుయేషన్. రైల్వేస్టేషన్... ప్లాట్ ఫామ్ పై బెంచ్.. దానిపైన మెగాస్టార్. సినిమా ఏంటో గుర్తొచ్చేసుంటుందిగా.. చూడాలనుంది. ఈ మూవీలో చిరు లవ్ స్టోరీ రైల్వే స్టేషన్ లోనే స్టార్ట్ అవుతుంది. ఈ తొలిప్రేమ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. వరుణ్ లవ్ స్టోరీ కూడా రైల్వే స్టేషన్ లోనే స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. అది నిజమైతే.. బాబాయి టైటిల్ ని.. పెదనాన్న లవ్ స్పాట్ ని అబ్బాయి మిక్స్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడేమో అనిపిస్తుంది.

Image result for varuntej tholiprema

ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించి టీజర్ కానీ.. సాంగ్స్ కానీ రిలీజ్ చేయలేదు. ఒక్క ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా బిజినెస్ టోటల్ గా క్లోజ్ అవ్వడమనేది మామూలు విషయం కాదు. ప్రెజెంట్ ఇదే టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్.. ఈ సినిమాను సుమారు 19 కోట్లకు కొనుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Image result for varuntej tholiprema

ఒక ప్రముఖ ఛానల్ ఈ సినిమా టెలికాస్టింగ్ రైట్స్ ను దాదాపు 5కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిదా ఓవర్సీస్ లో కూడా మార్కెట్ చేయడంతో ఈ సినిమాను ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ భారీ మొత్తానికి కొనుక్కున్నట్లు కూడా టాక్స్ నడుస్తున్నాయి. సో టోటల్ గా చూస్తే.. ఓన్లీ సింగెల్ ఫస్ట్ లుక్ తో 30కోట్లకు పైగా బిజినెస్ చేసి... రికార్డు సృష్టించాడు వరుణ్ తేజ్. కొంతమంది ఈ క్రెడిట్ అంతా.. పవన్ టైటిల్ దేనని కామెంట్స్ చేస్తున్నారు.

Image result for chudalani undi

వెంకీ అట్లూరీ డైరెక్షన్ లో వస్తున్న ఈ తొలిప్రేమ.. రిలీజ్ అవ్వకముందే ఇంత మ్యాజిక్ చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. సంక్రాంతి హడావిడి తర్వాత తీరిగ్గా ప్రేమికుల నెలైన ఫిబ్రవరిలో వరుణ్ తొలిప్రేమను రిలీజ్ చేయబోతున్నారట. అప్పట్లో ఆ తొలిప్రేమ బాబాయికి  బ్రేక్ ఇచ్చినట్లే... ఇప్పుడు ఈ తొలిప్రేమ అబ్బాయికి కూడా బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారంతా.. ఏమో ఇది నిజమైతే ఇక టాలీవుడ్ లో వరుణ్ తేజ్ ఇమేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఏమైనా కూడా ఒక్క టైటిల్ తో లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: