‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి అనేక ఆలోచనలు చేసి చివరకు చరణ్ జూనియర్ లతో ఒకభారీ మల్టీ స్టారర్ చేస్తున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి మరొక ఆసక్తికర విషయం ఈమధ్య బయటకు వచ్చింది. రాజమౌళి సినిమాలకు సంబంధించి అతడి దగ్గర డైరెక్షన్ టీమ్ లో పనిచేసే పదిమంది యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ రాజమౌళి సినిమాలకు సంబంధించి గుండెకాయలా వ్యవహరిస్తూ ఉంటారు. 

అటువంటి రాజమౌళి టీమ్ ను ప్రస్తుతం జక్కన్న జూనియర్ చరణ్ లతో తీయబోతున్న మల్టీ స్టారర్ కోసం రెండు ముక్కలుగా విడకొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా రెండు ముక్కలుగా విడిపోయిన తరువాత చరణ్ కోసం ఒక టీమ్ జూనియర్ కోసం ఒకటీమ్ పోటాపోటీగా పనిచేయబోతున్నాయి. ఈసినిమాకు సంబంధించిన జూనియర్ చరణ్ ల మధ్య పోటాపోటీగా ఉండే సీన్స్ క్రియేట్ చేయడంతో పాటు జూనియర్ చరణ్ ల లుక్ కు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఈ టీమ్స్ ఆలోచిస్తాయి అని టాక్. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కథ ఓకె అవ్వడంతో ఈమూవీ స్క్రీన్ ప్లే రైటింగ్ విషయంలోనూ అదేవిధంగా ఈమూవీలోని డైలాగ్స్ విషయంలోనూ తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఈమూవీకి కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ రైటర్స్ టీమ్ తో రాజమౌళి విభజించిన ఈ టీమ్స్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. తాను తీసే ప్రతి సినిమాలోను ప్రతి సీన్ ను ఆలోచించి తీసే రాజమౌళి చరణ్ జూనియర్ లకు సంబంధించిన మల్టీ స్టారర్ విషయంలో స్క్రిప్ట్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా మొదలుపెట్టె ముందు రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ ను కొన్ని జూనియర్ కు సంబంధించిన సీన్స్ ను కొన్ని టెస్ట్ షూట్ నిర్వహించే బాధ్యత కూడ ఈ టీమ్ లకు రాజమౌళి అప్పచెప్పినట్లు టాక్. ఈ టెస్ట్ షూట్ జరిగిన తరువాత ఈరెండు టీమ్ లు చిత్రీకరించిన సీన్స్ ను పరిశీలించి ఒక క్లారిటీకి వస్తాడట జక్కన్న.. 



మరింత సమాచారం తెలుసుకోండి: