మెగాస్టార్ చిరంజీవికి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్న నేపధ్యంలో మెగా అభిమానుల దృష్టిలో చిరంజీవి  సినిమాల గురించి మాత్రమే కాదు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చిన్న న్యూస్ బయటకు వస్తే చాలు. ఆన్యూస్ వెనువెంటనే మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో మెగాస్ట్రార్ చిరంజీవి ఇంటి ఎదుట శ్రీదేవి అనే మహిళ చేసిన హడావిడి ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ఈవిషయానికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం శ్రీదేవి అనే మహిళా చిరు ఇంటిముందు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు  హంగామా సృష్టించింది. చివరకు ఆమె బంధువులు ఎంటర్ కావడంతో ఈవ్యహారం ముగిసింది. 40 సంవత్సరాల వయస్సు ఉన్న శ్రీదేవి తాను చిరంజీవికి తెలుసునంటూ హంగామాసృష్టించింది. 

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 26లో ఉన్న చిరంజీవి ఇంటి వద్దకు అర్ధరాత్రి తర్వాత తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్రీదేవి వచ్చినట్లు తెలుస్తోంది. ఉదయాన్నే చిరంజీవి ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ వారు ఆమెను గుర్తించి ఆమె వివారాలు అడిగితే తనకు చిరంజీవి బాగా తెలుసు అని శ్రీదేవి వచ్చింది అని చెప్పండి ఆయన వస్తారని సెక్యూరిటీతో చెప్పడమే కాకుండా ఒక దశలో చిరంజీవి సెక్యూరిటీని కూడ ఆమె డబాయించినట్లు టాక్. 

అయితే అక్కడ సెక్యూరిటీ వారు చిరంజీవిని కలవాలి అంటే అపాయింటుమెంట్ ఉండాలి అని వారు చెప్పినా ఆమె ఆమాటలు వినకుండా పెద్ద హంగామానే సృష్టించింది అని వార్తలు వస్తున్నాయి. దీనితో అతికష్టం మీద ఆమె వ్యక్తిగత వివరాలు సేకరించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆమె బంధువులకు అప్పగించినట్లు సమాచారం. భాగ్యనగరంలోని బాచుపల్లిలో ఉండే ఆమె సోదరికి సమాచారం ఇవ్వడంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించి కుటుంబ సభ్యులు, బంధువులతో హామీపత్రం రాయించుకొని నిన్న శనివారం సాయంత్రం ఆమెను సాగనింపినట్లు వార్తలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: