స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథల సెలక్షన్స్ గురించి అందరికి తెలిసిందే. రొటీన్ ఫార్ములా అసలు ఇష్టపడని బన్ని సినిమా సినిమాకు తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటాడు. ఇక ప్రస్తుతం వక్కంతం వంశీ నా పేరు సూర్య సినిమలో నటిస్తున్న బన్ని ఆ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడు అన్న విషయం మీద డిస్కషన్స్ మొదలయ్యాయి.


ఇక ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న ఓ క్రేజీ న్యూస్ ఏంటంటే అనీల్ కన్నెగంటి అనే దర్శకుడు చెప్పిన ఓ కథకి ఫిదా అయిన బన్ని ఆ సినిమా కథని కోటి ఇచ్చి కొనేశాడట. తన టీం కు ఆ కథ అప్పగించాడని టాక్. అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన అనీల్ కథలు రాస్తుంటాడు. 


అల్లు అర్జున్ కోసం ఓ కథ రాసుకుని వినిపించగా కథ నచ్చేసిందట. అయితే అనీల్ డైరక్షన్ లో కన్నా ఆ సినిమాకు పెద్ద దర్శకుడు అయితే బాగుంటాడని ఊహించి తన దగ్గర నుండి కథ కోటి రూపాయలకు కొనేశాడట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది.


ఇక అనీల్ ఓ నిర్మాణ సంస్థకు కూడా కథ సిద్ధం చేశాడట. మరి వారు కూడా అతని డైరక్షన్ లో ఆ కథను సిద్ధం చేస్తారో లేక వారు కూడా కథ కొనేస్తారో తెలియాల్సి ఉంది. మొత్తానికి కథల కొరత ఉన్న టాలీవుడ్ లో అనీల్ కన్నెగంటి కథలకు బాగా డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: