అదేంటీ చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి హల్ చల్ చేయడానికి కారణం ఏంటీ..అని అశ్చర్యపోతున్నారు..అవునండి మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి హల్ చల్ చేసింది..కాకపోతే ఈమె హీరోయిన్ శ్రీదేవి మాత్రం కాదు..చిరంజీవికి వీరాభిమాని.  సాధారణంగా అభిమానులు తమకు ఇష్టమైన అభిమాన హీరో, హీరోయిన్లను చూడటానికి ఎంతకైనా తెగిస్తారన్నవిషయం తెలిసిందే..వారి కోసం ఇంటి ముందు, స్టూడియోల వద్ద పడిగాపులు కాస్తుంటారు. 
చిరంజీవి
గతంలో పవన్ కళ్యాన్ ని చూడాలని, మాట్లాడలని ఓ యువతి ఎంత హంగామా చేసిందో తెలిసిందే. తాజాగా మెగాస్టార్ ఇంటి ముందు కూడా అచ్చం ఇలాంటి పరిస్థితే నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన 40 ఏళ్ళు పైబ‌డ్డ శ్రీదేవి అనే మ‌హిళ చిరంజీవి ఇంటికి చేరుకొని, ఆయ‌న‌ని పిల‌వాల‌ని సెక్యూరిటీతో గొడ‌వ‌ప‌డింద‌ట‌. దాదాపు మూడు గంటల పాటు శ్రీదేవి అక్క‌డే హ‌డావిడి చేసింది. 
Related image
చివరకు ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని ఆమె బంధువులను పిలిపించి..ఆమెకు ఎలాగోఅలా సర్థిచెప్పి పంపించారు.  ఆ సమయంలో అక్కడ చాలా మంది అభిమానులు కూడా గుమికూడటంతో మెటర్ కాస్త సీరియస్ అయ్యింది.  ప్ర‌స్తుతం సైరా చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి దృష్టికి ఈ విష‌యాం వెళ్లలేదని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: