ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కు కోప౦ వచ్చిందట. ఆ కోపం తో ఒక ప్రముఖ టాలీవుడ్ దర్శకుడిపై చిందులు వేశాడని టాక్. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు..? అనేదే గా మీ ప్రశ్న. ప్రస్తుతం మహేష్ లండన్ లో ‘వన్’ సినిమా షూటింగ్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రిన్స్ మహేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న గుణశేఖర్ తాను అనుష్క తో తీస్తున్న ‘రాణి రుద్రమ’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కు ఎలాగో అలాగ మహేష్ ను ఒప్పిద్దామని ఈ మధ్య లండన్ వెళ్లి తాను తీస్తున్న సినిమా గురించి పూర్తిగా మహేష్ కు వివరించడమే కాకుండా ఈ సినిమాలో మహేష్ పోషించే గోనగన్నారెడ్డి పాత్ర గురించి వివరించాడట. ఈ పాత్ర రాణి రుద్రమ సామంత రాజు గా చరిత్రలో మిగిలిపొయిన పాత్రగా చెప్పడమే కాకుండా ఈ పాత్ర వల్ల రాణి రుద్రమ క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అవుతుందో కూడా గుణశేఖర్ మహేష్ కు వివరించాడట.

పూర్తిగా తన పాత్రను విన్న తరువాత షాక్ అయి పోయిన ప్రిన్స్ మహేష్, తాను అనుష్క కింద ఒక సామంత రాజు గా చూపెడితే తన అభిమానులు ఊరుకుంటారా..? అని నవ్వుతూ ఈ పాత్రకు మరో హీరోను చూసుకోండి అంటూ సున్నితంగా తిరస్కరించాడట. అయినా పట్టు వీడని విక్రమార్కుడిలా గుణశేఖర్ మహేష్ ను వరసపెట్టి ఈ సినిమా గురించి విసిగిస్తూ ఉండడంతో, ఎప్పుడూ కోపం తెచ్చుకొని మహేష్ బాబు గుణశేఖర్ పై తన కోపాన్ని ప్రదర్శించడమే కాకుండా తన పై కామెడీ సీన్స్ తీద్దామని మీకెందుకు కోరిక కలిగింది అంటూ ఘాటుగానే మహేష్ గుణశేఖర్ కు సమాధానం ఇచ్చి, ఈ విషయంపై తనని ఇక సంప్రదించవద్దని తేల్చిచెప్పాడట. అనుకోని ఈ సంఘటనకు గుణశేఖర్ కూడా షాక్ అయ్యాడని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: