టాప్ హీరోల సినిమాలను అదేవిధంగా భారీ బడ్జెట్ సినిమాలను సెంటిమెంట్స్ ఏవిధంగా ప్రభావితం చేస్తాయో ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. ఈ సెంటిమెంట్లు అన్నిసార్లు కలిసిసొచ్చి భారీ విజయాలను ఇవ్వకపోయినా ఇంకా మన సినిమా రంగం వారు ఈ సెంటిమెంట్ చట్రం నుండి బయటకు రాలేకపోతున్నారు.

ఈనెలలో విడుదల కాబోతున్న అఖిల్ సినిమా పై కూడ ఒక భారీ సెంటిమెంట్ ప్రభావం చూపెడుతోంది. ఈసినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కు ‘ప్రియ’ అన్న పేరు పై విపరీతమైన సెంటిమెంట్ ఉంది. ఈకారణంగానే అతడు తీసే సినిమాలలో హీరోయిన్ పాత్రకు ‘ప్రియ’ అన్న పేరు పెడితే ఆమూవీ సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం విక్రమ కుమార్ కు ఉంది.   

విక్రమ్ కుమార్ కు భారీ హిట్ ను ఇచ్చిన ‘ఇష్క్’ మూవీలో నిత్యామీనన్ పాత్ర పేరు ‘ప్రియ’. అదేవిధంగా విక్రమ్ కుమార్ కు ఎంతగానో పేరు తెచ్చిన ‘మనం’ చిత్రంలో సమంత పాత్ర పేరు ‘ప్రియ’ అదేవిధంగా ఈ దర్శకుడు హీరో సూర్యాతో తీసిన ‘24’ సినిమాలో నటించిన నిత్యామీనన్ పాత్ర పేరు కూడ ప్రియ. ఇలా ఈ దర్శకుడు నిర్మించిన చాల సినిమాలలో హీరోయిన్ పాత్రకు ‘ప్రియ’ అనే పేరు పెట్టడం అతడి సెంటిమెంట్.

అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్ అఖిల్ ‘హలో’ లో రిపీట్ కాబోతోంది. ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన కల్యాణి ప్రియదర్శిన్ పాత్ర పేరు కూడ ‘ప్రియ’. ఇలా విక్రమ్ తీస్తున్న చాల సినిమాలలో హీరోయిన్ కు ఈ ప్రియ పేరు ఉండటంతో విక్రమ్ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఈ ‘ప్రియ’ పేరు ఉందా లేక అనుకోకుండా విక్రమ్ ఇలా తన సినిమాలలోని హీరోయిన్స్ కు ఇలా ‘ప్రియ’ పేరు పెడుతున్నాడా ? అన్న విషయం పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. హిట్ కోసం పరితపిస్తూ టెన్షన్ పడుతున్న అఖిల్ కు విక్రమ్ కుమార్ సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: