నందమూరి సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో ‘జయసింహ’ సినిమాలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. బాలకృష్ణ రెండవ కుమార్తె తేజశ్విని వివాహం ఈ నెలాఖరున హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరగబోతోంది. దాదాపు 30 వేల మంది అతిధుల కోసం ఒక ప్రత్యేకమైన వివాహ మండప సెట్ ను బాలకృష్ణ దగ్గర ఉండి డిజైన్ చేయిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంత బిజీలో ఉండి కూడా జయసింహ సినిమా షూటింగ్ కు ఎక్కడా బ్రేక్ రాకుండా సమయం కేటాయిస్తూ, త్వరగా ఈ సినిమాను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక పెళ్లి పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేయి౦చిన కోటి రూపాయల భారీ సెట్ లో దర్శకుడు బోయపాటి బాలయ్య తో పాటుగా ఈ సినిమాలో నటిస్తున్న ముఖ్యమైన తారాగణం అందరితోనూ చిత్రికరిస్తున్నాడు. డాన్స్ డైరెక్టర్ బృందా ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేశారు. ఉదయం తన కూతురి వివాహ పనులతోనూ, ఆ తరువాత జయసింహ సినిమాకు సంబంధించిన పెళ్లి పాటలోనూ బాలయ్య బిజీ గా ద్విపాతాభినయం చేస్తూ, అటు రియల్ లైఫ్ లోనూ ఇటు రీల్ లైఫ్ లోనూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. ఈ సినిమా వీలైనంత తొందరగా పూర్తి చేసి ఇక ప్రత్యక్ష రాజకీయాలలోకి బాలయ్య రాబోతున్నడనే వార్తలు ఇప్పటికే మీడియా లో కధనాలు గా వస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: