తెలుగు ఇండస్ట్రీలో అష్టాచమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి మాత్రం వరుసగా విజయాలు అందుకుంటున్నాడు.  ఇప్పుడు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారారు నాని.  ప్రస్తుతం వాల్ పోస్టర్ సినిమా ప‌తాకంపై ‘అ!’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, కాజ‌ల్, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, రెజీనా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. 
Image result for awe movie
కాగా, ఇటీవ‌ల విడుద‌ల చేసిన నిత్యా మీనన్, అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ లుక్‌ల‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది.   తాజాగా  ఈ సినిమా నుంచి, ఈషా రెబ్బా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్రకి సంబంధించిన కలలను .. జ్ఞాపకాలను ప్రతిబింబిస్తూ, గుడి గోపురం .. చెట్టుపైన గువ్వల జంట .. పాపను నడిపించుకుంటూ వెళుతోన్న తండ్రి ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. ముక్కుపోగుతో ఆమె లుక్ చాలా డిఫరెంట్ గా వుంది. 
Image result for awe movie
 ‘అంతకు ముందు ఆ తరువాత’(2013)తో తెలుగు తెరకు పరిచయమైన ఈషా.. ‘అమీతుమీ’, ‘దర్శకుడు’ వంటి చిత్రాల‌తో న‌టిగా త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకుంది. ఇప్పుడు ‘అ!’ మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మని వరించింది మంచి పాత్రేనని ఈ పిక్ చూసి చెప్పవచ్చు. ఫిబ్ర‌వ‌రిలో ‘అ!’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  నాని సమర్పణలో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 90 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: