పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ అవనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


ఇక ఈ సినిమా ఆడియో ఈ నెల 16న నోవాటెల్ లో రిలీజ్ కానుందట. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా వస్తున్నారని టాక్. మెగాస్టార్ కూడా పదేళ్ల తర్వాత ఖైది నంబర్ 150తో మళ్లీ ఫాం లోకి వచ్చాడు. ఇద్దరు మెగా బ్రదర్స్ మెగా అభిమానులకు ఏం అభివాదం ఇవ్వబోతున్నారు అన్నదాని మీద డిస్కషన్స్ మొదలయ్యాయి.


ఓ పక్క సినిమాలే కాదు పాలిటిక్స్ లో కూడా జనసేన నిర్మించి 2019 ఎన్నికల్లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఈమధ్యనే తన అన్న మీద ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు పక్కన ఉన్న వ్యక్తుల వల్ల పీఆర్పికి నష్టం కలిగిందని అన్నారు. అన్నయ్య మీద ప్రేమను చూపిస్తున్న పవన్ ఈసారి ఇద్దరు కలిసి అటెండ్ అవుతున్న ఈ వేడుకలో ఏం మాట్లాడతారు అన్న విషయం మీద అందరి దృష్టి ఉంది.  


సినిమా ఫంక్షన్ కాబట్టి కేవలం సినిమాకు సంబందించిన మాటలనే మాట్లాడుతారని చెప్పలేం. చిరు, పవన్ చాన్నాళ్ల తర్వాత కలుస్తున్న ఈ సందర్భాన్ని అన్నివిధాలుగా వాడుకోవాలని చూస్తున్నారు. ఇద్దరు మాట్లాడతారు అన్న విషయంపై అందరు డిస్కషన్స్ మొదలు పెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: