28 సంవత్సరాల క్రితం నాగార్జున ‘శివ’ సినిమాకోసం చేతికి సైకిల్ చైన్ ను చుట్టుకుని ఫైట్స్ చేస్తే ఆసీన్ ను అనుసరిస్తూ ఎందరో యూత్ తమ చేతులకు సైకిల్ చైన్స్ ను చుట్టుకుని వీరంగం సృష్టించిన సందర్భాలను అనేకసార్లు చూశాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ లో ఒక ప్యాంటు పై మరొక ప్యాంటు వేసుకుని విచిత్రంగా కెమెరాలకు పోజులు ఇస్తే పవన్ ఫ్యాషన్ ను అనుసరిస్తూ ‘గుడుంబా శంకర్’ ప్యాంటులు వ్యాపారులకు లక్షలలో అమ్మకాలను జరిపేలా చేసాయి. 

ఇప్పుడు అటువంటి మరో కొత్త ట్రెండ్ ను పవన్ క్రియేట్ చేయబోతున్నాడు. నిన్న విడుదలైన ‘అజ్ఞాతవాసి’ మూవీకి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ లో సైకిల్ ఎక్కిన పవన్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ రెడీఫర్ యాక్షన్ అన్నట్లుగా నోటితో బెల్ట్ పట్టుకుని ఒక వార్ కు సిద్ధం అవుతున్న పవన్ పోజుకు సంబంధించిన ఈఫోటో ట్రెండ్ సెటింగ్ గా మారింది. 

ఈస్టిల్ విడుదలైన కొద్ది సేపటికే పవన్ అభిమానుల నుండి వేల సంఖ్యలో లైక్స్ సంపాధించుకుంటే అదేవిధంగా ఈ స్టిల్ పై భారీ స్థాయిలో సెటైర్లు కూడ పొందుతోంది.  గతవారం పవన్ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ తెలుగుదేశ ప్రభుత్వాన్ని అధినాయకుడు చంద్రబాబుని విమర్శించిన సంఘటనలు జరిగి కొద్దిరోజులు అవ్వకుండానే పవన్ అప్పుడే మళ్ళీ సైకిల్ ఎక్కేసాడా అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. 

అంతేకాదు తెలుగుదేశం అదేవిధంగా సైకిల్ తనకు ఫ్రెండ్ కాదు అని చెపుతూ తప్పు చేస్తే ఎవర్ని అయినా నిలదీస్తా అని అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించిన పవన్ ఇప్పుడు తన ‘అజ్ఞాతవాసి’ ద్వారా సైకిల్ ను ప్రమోట్ చేస్తున్నాడా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. రాజకీయాలలో శాశ్విత శత్రువులు మిత్రులు ఉండరు అన్నది ఓపెన్ సీక్రెట్ అయినా పవన్ చంద్రబాబును విమర్శించి వారం కూడ కాకుండానే ఇలా ‘అజ్ఞాతవాసి’ కోసం సైకిల్ ఎక్కడం ఇప్పుడు పవన్ అభిమానులను కూడ ఆశ్చర్య పరుస్తున్న విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: