‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించిన దగ్గరనుంచి  మహేష్ వెంకటేష్ ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిన నేపధ్యం తెలిసిందే. అయితే అటువంటి మహష్ కి ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అనుకోని షాక్ తగిలింది. మహేష్ వచ్చేఏడాది చివరిలో  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు అని మహేష్ అభిమానులు అంతా ఆసిస్తూ ఉంటే  త్రివిక్రమ్ ఆఊహలకు బ్రేక్ వేస్తూ వచ్చేఏడాది చివరిలో తాను వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసి మహేష్ అభిమానుల మైండ్ బ్లాంక్ చేసాడు. 
చాలా కాలంగా వెయిట్ చేస్తున్న అభిమానులు
గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్' ‘మల్లీశ్వరి' సినిమాలంటే ఇప్పటకీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానం అయితే ఆసినిమాలను తీసింది దర్శకుడు విజయ్ భాస్కర్ అయినా కూడ ఆసినిమాలకు పదునైన మాటలతో కూడిన స్క్రిప్ట్ రాసింది త్రివిక్రమ్. దీనితోమాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తే చూడాలని ఎప్పటినుంచో వెంకటేష్ అభిమానులు ఆసపడ్డారు.

ఇప్పడు ఆ ఆశ నెరవేర బోతోంది ఈరోజు వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ బ్యానర్ 6వ ప్రొడక్షన్ వెంచర్ ను మాటలమాంత్రికుడు  త్రివిక్రమ్ డైరక్షన్ లో  చేయబోతున్నట్లు ప్రకటించారు. 'అజ్ఞాతవాసి' సినిమా తరువాత   తమ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేసిన తరువాత వెంటనే వెంకటేష్ త్రివిక్రమ్ ల మూవి మొదలు అవుతుంది.
వెంకీ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ మూవీ చేయనున్న త్రివిక్రమ్
వెంకీ త్రివిక్ర‌మ్‌ ల‌ మధ్య ఈరోజు ఈమూవీ ప్రాజెక్ట్ ప్రకటన వెనుక  నిర్మాత  సురేష్ బాబు  హస్తం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పటినుంచో వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నా టాప్ యంగ్  హీరోల ధ్యాస‌లో ప‌డిపోయిన త్రివిక్ర‌మ్ వెంకటేష్ తో సినిమా చేయడానికి ఒప్పించడం వెనుక పెద్ద వ్యుహాలే నడిచినట్లు టాక్. ఈవ్యూహాల ఒత్తిడితో త్రివిక్రమ్ మహేష్ తో సినిమాను చేయాలి అన్న తన ప్లాన్ ను మార్చుకుని వెంకటేష్ వైపు అడుగులు వేసినట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: