మెగాస్టార్ చిరంజీవి మీద సెటైర్ వేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అయితే తన నికార్సైన మాటలతో ఎలాంటి వారినైనా అడిగి కడిగి పారేయగల పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి చిరంజీవి ఎదురుగా ఉండగానే ఆయన మీద సెటైర్ వేశాడు. నిన్న తెర వెనుక దాసరి పుస్తకావిష్కరణ జరుగగా.. అందులో భాగంగా నారాయణ మూర్తి చిరంజీవి ఏమంత గొప్ప సినిమాలు చేశాడు అంటూ కామెంట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు చేస్తున్న సైరా నరసిం హారెడ్డి సినిమా అంటే అన్నట్టు చెప్పుకొచ్చాడు.   


ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. మెగాస్టార్ గురించి చెప్పుకోడానికి ఏ సినిమా లేదు అన్నాడు నారాయణ మూర్తి. కాని ఇప్పుడు సైరా మాత్రం ఉంది అంటూ కాస్త శాంత పరచాడు. మూర్తి మాటలకు చిరు కూడా ఓ చిరునవ్వి నవ్వి ఊరుకున్నారు. ఇక తనకు దాసరికి ఉన్న అనుబంధం గురించి చెప్పిన మూర్తి గారు తనని తెర మీదకు తీసుకొచ్చింది ఆయనే అని అన్నారు.


అయితే చిరంజీవి గురించి ఆయన అభిప్రాయాన్ని చెప్పినా చిరు కేవలం కమర్షియల్ సినిమాలే కాదు స్వయంకృషి, రుద్రవీణ, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి అద్భుతమైన సినిమాలను చేశాడు. కచ్చితంగా తెలుగు తెర మీద అవి అద్భుత సినిమాలే అని చెప్పొచ్చు. 


ఇక ఇదే కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా దాసరి చిన్న సినిమాల మేలు కోరే వారని.. సినిమా పరిశ్రమకు దాసరి పెద్ద దిక్కని ఆయన స్థానంలో ఇప్పుడు చిరంజీవి ఆ స్థానం భర్తీ చేయాలని అన్నారు. ఆ భాధ్యతలను మెగాస్టార్ తీసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: