రాంచరణ్ హిట్టవుతాడు, పవన్ కళ్యాణ్ ఫట్టవుతాడు అంటున్నాడు ‘ఎవడు’ నిర్మాత దిల్ రాజు. తను డబ్బులు పెట్టి తీసిన సినిమా కష్టాల్లో పడి వాయిదా పడితే దానికి పోటీగా వస్థున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫట్టవుతుంది  అంటున్నాడేంటి అనుకుంటున్నారా..

డైరెక్టుగా ‘ఎవడు’ హిట్టవుతుంది, పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ప్లాప్ అవుతుంది  అని అనలేదు గాని అది అందరికి అర్థమయ్యేలా వివరించాడు. ఎంతయినా పేరులో దిల్ ఉందిగా, అందుకే అందరి మనసులకు అర్థమయ్యేలా తన అంతరంగం పరోక్షంగా చెప్పేసాడు.

గతంలో కూడా ‘ఖలేజా’, ‘బృందావనం’ సినిమాలు ఇలాగే పోటీపడ్డాయట. అప్పుడు కూడా ‘ఖలేజా’ కోసం ‘బృందావనం’ ఓవారంపాటు వాయిదా వేసాడట. అయితే ‘బృందావనం’ హిట్టయిందని, ఇప్పుడు కూడా పవణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాతో పాటు రాంచరణ్ సినిమా ‘ఎవడు’ అలాగే తయారయ్యాయి, రిజల్ట్ కూడా అప్పటిలాగే వస్థుంది, ‘ఎవడు’ హిట్టువుతుంది అన్నాడు. దీని అర్థం వేరే చెప్పాలా...ఇక ఫట్టయ్యేది పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ అన్నట్టే కదా. ఎవరి నమ్మకం వారిది కాని కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నట్టు సీన్ రివర్స్ అయితేనే దిల్ తట్టుకోవడం కష్టం అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: