కాంతకోసం రాజులు రాజ్యాలే కోల్పోయారు అన్నది నానుడి, అంతెందుకు ప్రేయసి మోజులో పడి ఉన్నదంతా ఊర్చి పెట్టి దివాలాతీస్థున్నవారినెందరినో చూస్థున్నాం. అలాంటి గాథల్లో నటించి నలుగురిని ఆదారిలో పడకుండా చూసే సినిమావాళ్లు కూడా అదే దారిలో వెలుతున్నారా... అంటే నిజమని చెప్పలేం కాని కాదని మాత్రం అనలేం అంటున్నారు సినిమా వాళ్లు.

ఈజాబితాలోకి ఓప్రముఖ తమిళ హీరో శింభు చేరుతాడేమోనన్న అనుమానాలను వ్యక్థం చేస్థున్నాయి సినీ వర్గాలు. కారణం ఇప్పటికే ఓసారి ఓ అందాల హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడి ఇక పెళ్లి కూడా చేసుకుంటాన్నంత దాకా వెల్లి అప్పటి దాకా సంపాదించింతా ప్రేయసి కానుకలకు వెచ్చించి ఆతరవాత అది వికటించి బేర్ మన్నాడని సినిమావాళ్ల భోగట్టా.

ఇప్పుడు అదే హీరో శింభు హన్సిక ప్రేమలో పడి విలవిల కొట్టుకుంటున్నాడంటున్నారు. హన్సిక లవ్ ఏమి ఫ్రేష్ కాదులెండి, ఆమెకు ఇంతను ముందు ఓ హీరో కమ్ డైరెక్టర్ హిమేష్ రేష్మిన్ తో ఇలాగే లవ్వాట ఆడి వదిలేసిందన్న వదంతులు ఉన్నాయి.

ఇప్పుడు శింభుతో హన్సిక ట్విట్టర్లలో ప్రేమాయణం సాగించి అది కాస్థా పెళ్లిదాకా వెళ్లి అది పెద్దల చేతిలో ఉందని చెప్పుకునే దాకా వెల్లిన సంగతి తెలిసిందే. అయితే ఏమయిందో తెలియదు కాని సడన్ గా హన్సిక తనకు మరో అయిదేళ్ల పాటు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పడంతో హతాషుడైన శింభు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఓ అధునాతన బిల్డింగ్ ను కానుకగా ఇచ్చేందుకు అన్ని హంగులతో సిద్దం చేయిస్థున్నాడట, అందుకే వాళ్లిద్దరు ఇప్పుడు చెన్నైలో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని పుకార్లు వెలువడుతున్నాయి. తీరా కానుక చేతిలో పడ్డాక హన్సిక హ్యాండిస్థే....  శింభు పరిస్థితి ఖతమే అంటున్నాయి సినీవర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: